HHVM : తెలంగాణ లో వీరమల్లు టికెట్ ధరలు భారీగా పెరగనున్నాయా..?
HHVM : తెలంగాణలో గరిష్ఠంగా రూ. 400, కనిష్ఠంగా రూ. 200 ధరల వరకు టికెట్లు ఉండే అవకాశం ఉంది. విడుదలైన తొలి వారం ఈ ధరలే అమలు కానున్నట్లు తెలుస్తోంది
- By Sudheer Published Date - 12:10 PM, Sat - 31 May 25

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో రూపొందుతున్న చారిత్రక చిత్రం హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) జూన్ 12 వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున పలు భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమా 17వ శతాబ్దం నేపథ్యంతో రూపొందిన ఇతిహాస గాధ కావడంతో, దీనికి సంబంధించిన టికెట్ ధరల పెంపు, అదనపు షోలు వంటి విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల విషయంలో ఎలాంటి సమస్యలు లేనప్పటికీ, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఈ అంశంపై చాలా సీరియస్‌గా ఉన్నారు.
Gaddar Awards : ఈ తరహా గౌరవాలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉండాలి: ఆర్ నారాయణమూర్తి
సంధ్య థియేటర్ ఘటన తర్వాత రాష్ట్రంలో ఫ్యాన్స్ షోలు, బెనిఫిట్ షోలు, అధిక ధర టికెట్లు అనేవి పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో హరి హర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి టికెట్ ధరల సవరణ అంశంపై చర్చించారు. సినిమా సామాన్య వాణిజ్య చిత్రంలా కాకుండా, చారిత్రక నేపథ్యంతో భారీ స్థాయిలో తెరకెక్కిందని వివరిస్తూ టికెట్ ధరల పెంపుపై మద్దతు కోరారు. సీఎంతో జరిగిన భేటీపై చిత్రబృందం హర్షం వ్యక్తం చేస్తూ, సీఎం ఇచ్చిన సమయం, ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుత సమాచారం ప్రకారం..హరి హర వీరమల్లుకు తెలంగాణలో గరిష్ఠంగా రూ. 400, కనిష్ఠంగా రూ. 200 ధరల వరకు టికెట్లు ఉండే అవకాశం ఉంది. విడుదలైన తొలి వారం ఈ ధరలే అమలు కానున్నట్లు తెలుస్తోంది. అదనపు షోలు మంజూరు అయితే, డే వన్ కలెక్షన్ల పరంగా సినిమా కొత్త రికార్డులు నమోదు అయ్యే అవకాశముంది. ఈ మూవీ లో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా, అనసూయ ఓ ప్రత్యేక గీతంలో మెరిశారు. ఎంఎం కీరవాణి అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మొదట దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్టును ప్రారంభించగా, తరువాత జ్యోతి కృష్ణ దీనిని పూర్తిచేశారు