HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Awards Should Be Announced In Ap Too R Narayana Murthy

Gaddar Awards : ఈ తరహా గౌరవాలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉండాలి: ఆర్ నారాయణమూర్తి

ఈ తరహా గౌరవాలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో గద్దర్ అవార్డులు అందించడమూ, కళాకారులను గౌరవించడమూ అభినందనీయం. ఏపీలోనూ ఇలాంటి సన్మానాలు జరగాలి. ఇది సినీ సృజనాత్మకతకు ప్రోత్సాహంగా మారుతుంది అని అభిప్రాయపడ్డారు.

  • Author : Latha Suma Date : 31-05-2025 - 11:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Awards should be announced in AP too: R Narayana Murthy
Awards should be announced in AP too: R Narayana Murthy

Gaddar Awards : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రముఖ సినీ కళాకారులకు గద్దర్ అవార్డులు అందించి, సినీ రంగాన్ని గౌరవించడం పట్ల ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి హర్షం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ అవార్డులు తెలుగు సినిమాకు గౌరవాన్ని తీసుకొచ్చాయని పేర్కొన్నారు. ఈ తరహా గౌరవాలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో గద్దర్ అవార్డులు అందించడమూ, కళాకారులను గౌరవించడమూ అభినందనీయం. ఏపీలోనూ ఇలాంటి సన్మానాలు జరగాలి. ఇది సినీ సృజనాత్మకతకు ప్రోత్సాహంగా మారుతుంది అని అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో హరిహర వీరమల్లు సినిమాను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న వివాదాలపై నారాయణమూర్తి తీవ్రంగా స్పందించారు. హరిహర వీరమల్లుకు సంబంధించి కుట్ర జరుగుతోందన్న మాటలు అనవసరం. ఒక సినిమాతో కలిపి ఇండస్ట్రీ సమస్యలను కలపడం సరైన దారి కాదు. పర్సంటేజీ వ్యవహారం గత 25 ఏళ్లుగా ఉంది. దాన్ని ఇప్పుడు ఒక్క సినిమాతో లింక్ చేయడం సబబుకాదు, అని చెప్పారు.

Read Also: Loretta Swit : ప్రముఖ హాలీవుడ్ నటి కన్నుమూత

పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ చేసిన వ్యాఖ్యలపై కూడా నారాయణమూర్తి స్పందించారు. థియేటర్లు బంద్ చేస్తున్నారన్న వార్తలపై ఆయన స్పష్టతనిచ్చారు. థియేటర్లు మూసేస్తే కనీసం మూడు వారాల ముందే ప్రకటిస్తారు. ఇంకా ఎవరూ అధికారికంగా అలాంటి ప్రకటన చేయలేదు అని చెప్పారు. పర్సంటేజీ వ్యవస్థ గురించి మాట్లాడుతూ, చిన్న నిర్మాతలు, సింగిల్ థియేటర్లు బతకాలంటే ఇది అవసరమని తెలిపారు. ఇది పాత సమస్య. మేమూ ఎన్నోసార్లు ధర్నాలు చేశాం. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వద్దకు వెళ్ళాం. రామానాయుడు గారు మాటిచ్చారు కానీ ఆయన మరణించారు. అల్లు అరవింద్, దిల్ రాజు వంటి ప్రముఖులను కలిసి పర్సంటేజీ పై సహకరించమన్నాం. కానీ ఫలితం రాలేదు అని చెప్పారు. పవన్ కళ్యాణ్ వైఖరిపై స్పందిస్తూ పవన్ గారు తాజాగా డిప్యూటీ సీఎం అయ్యారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇండస్ట్రీ వారిని ఆయనే కలిసి సమస్యలు అడిగి పరిష్కరించాలని ఉండాలి. గతంలో రాజులు ప్రజల వద్దకు వెళ్లి మాట్లాడేవారు. ఇప్పుడు కూడా అలాగే జరిగితే బాగుంటుంది అని అభిప్రాయపడ్డారు. చివరిగా, పవన్ కళ్యాణ్‌కి విజ్ఞప్తి చేస్తూ నారాయణమూర్తి చెప్పారు. పర్సంటేజీ వ్యవస్థను పక్కన పెట్టకుండా దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. ఇది చిన్న నిర్మాతల ప్రాణాధారం. ఈ సమస్యపై మీరు చొరవ చూపాలి.

Read Also: New schemes : “మిషన్ 26 డేస్”..జూన్ 2 న తెలంగాణలో కొత్త పథకాలు.. !


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • CM Revanth Reddy
  • distributors
  • exhibitors
  • gaddar awards
  • R Narayana Murty

Related News

    Latest News

    • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

    • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

    • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

    • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

    • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd