Prabhas Dance Treat in Raja Saab : ప్రభాస్ కూడా అందుకు రెడీనా.. మహేష్ బాటలో ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ప్లానింగ్..!
Prabhas Dance Treat in Raja Saab రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ తో సత్తా చాటుతుండగా రీసెంట్ గా సలార్ 1 సీజ్ ఫైర్ తో అదరగొట్టాడు. ఈ సినిమా తర్వాత త్వరలో కల్కి సినిమాతో
- Author : Ramesh
Date : 30-01-2024 - 9:02 IST
Published By : Hashtagu Telugu Desk
Prabhas Dance Treat in Raja Saab రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ తో సత్తా చాటుతుండగా రీసెంట్ గా సలార్ 1 సీజ్ ఫైర్ తో అదరగొట్టాడు. ఈ సినిమా తర్వాత త్వరలో కల్కి సినిమాతో రాబోతున్న ప్రభాస్ సినిమాను సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా తో పాటుగా మారుతి డైరెక్షన్ లో రాజా డీలక్స్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. మారుతి మార్క్ ఎంటర్టైనింగ్ తో పాటుగా థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ని స్పెషల్ ట్రీట్ ఉండబోతుందని తెలుస్తుంది.
We’re now on WhatsApp : Click to Join
ప్రభాస్ యాక్షన్, ఫైట్ ఇవన్ని తెలిసిందే. ఫ్యాన్స్ కి ఈ అంశాలు ఫుల్ ట్రీట్ అందిస్తాయి. అయితే ఈసారి డ్యాన్స్ లో కూడా మజా అందించాలని చూస్తున్నారట. ఈమధ్య మహేష్ కూడా గుంటూరు కారం లో డ్యాన్స్ లతో అదరగొట్టాడు. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ కి కూడా ఆ ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. మారుతితో చేస్తున్న రాజా సాబ్ లో ఒక డ్యాన్స్ బిట్ అదిరిపోతుందని అంటున్నారు.
ఇన్నేళ్ల కెరీర్ లో ప్రభాస్ డ్యాన్స్ మీద ఎప్పుడు అంత ఫోకస్ పెట్టలేదు. ఈసారి రాజా సాబ్ లో ప్రభాస్ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నారట. ఇది నిజంగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్ అని చెప్పొచ్చు. ఇలా స్టార్స్ అంతా తమ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసేందుకు అన్నివిధాలుగా ట్రై చేస్తున్నారు. మహేష్ డ్యాన్స్ గురించి ఇదివరకు చాలా కామెంట్స్ రాగా గుంటూరు కారం సినిమాలో సూపర్ స్టార్ డ్యాన్స్ చూసి కామెంట్ చేసిన వాళ్ల నోళ్లు మూతపడ్డాయి.
ఇప్పుడు ప్రభాస్ కూడా అదే ప్లాన్ లో ఉన్నట్టు అర్ధమవుతుంది. రాజా సాబ్ లో డ్యాన్సులు ఇరగదీసేస్తాడట ప్రభాస్. ఈ సినిమాలో హీరోయిన్ గా మాళవిక మోహనన్ నటిస్తుండగా సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.