HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Film Chambers Letter To Film Federation To Speed Up Wage Talks

Film Chamber : వేతనాలపై చర్చలు వేగవంతం..ఫిల్మ్‌ ఫెడరేషన్‌కు ఫిల్మ్‌ ఛాంబర్‌ లేఖ

వాటిలో ముఖ్యంగా కాల్‌షీట్ వ్యవస్థపై స్పష్టత ఇచ్చారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉండే కాల్‌షీట్‌ను 12 గంటల రెగ్యులర్ పని సమయంగా పరిగణించాలని సూచించారు. ఇక కార్మికులకు రెట్టింపు వేతనం ఇవ్వాల్సిన సందర్భాలు పరిమితమయ్యాయి. నెలలో రెండో ఆదివారం, అలాగే కార్మికశాఖ అధికారికంగా ప్రకటించే సెలవు దినాల్లో మాత్రమే డబుల్ పే వర్తించనుంది.

  • By Latha Suma Published Date - 11:15 AM, Sun - 17 August 25
  • daily-hunt
Film Chamber's letter to Film Federation to speed up wage talks
Film Chamber's letter to Film Federation to speed up wage talks

Film Chamber :  తెలుగు చిత్ర పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపు అంశం మరోసారి ప్రధాన చర్చాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (Telugu Film Chamber of Commerce) ఫిల్మ్‌ ఫెడరేషన్‌కు ఒక అధికారిక లేఖ రాసింది. లేఖలో కార్మిక వేతనాల పెంపును పర్సంటేజ్ విధానంలో సూత్రీకరించడంతో పాటు, నాలుగు ముఖ్యమైన షరతులను స్పష్టంగా పేర్కొంది. ఫిల్మ్ ఛాంబర్ పంపిన లేఖ ప్రకారం, కొన్ని కీలక మార్గదర్శకాలను ఫెడరేషన్‌కు సూచించారు. వాటిలో ముఖ్యంగా కాల్‌షీట్ వ్యవస్థపై స్పష్టత ఇచ్చారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉండే కాల్‌షీట్‌ను 12 గంటల రెగ్యులర్ పని సమయంగా పరిగణించాలని సూచించారు. ఇక కార్మికులకు రెట్టింపు వేతనం ఇవ్వాల్సిన సందర్భాలు పరిమితమయ్యాయి. నెలలో రెండో ఆదివారం, అలాగే కార్మికశాఖ అధికారికంగా ప్రకటించే సెలవు దినాల్లో మాత్రమే డబుల్ పే వర్తించనుంది.

Read Also: Shubhanshu Shukla : స్వదేశానికి చేరుకున్న శుభాంశు శుక్లా.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం, వీడియో వైరల్

ఇక, 2022 జూలైలో ఫెడరేషన్‌తో చేసిన ఒప్పందంలోని కీలక అంశాలు కూడా ఈ లేఖలో ప్రస్తావించబడ్డాయి. ప్రత్యేకంగా ఫైటర్స్, డాన్సర్స్ కోసం సూచించిన రేషియోలను 2023 సెప్టెంబరు నుంచి అమలులో పెట్టకపోవడాన్ని ఛాంబర్ తప్పుపట్టింది. వీటిని వెంటనే అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేసింది. అదే ఒప్పందంలోని జనరల్ కండిషన్స్ క్లాజ్‌ 1 ప్రకారం, నైపుణ్యం ఉన్న ఏ వ్యక్తినైనా తమ చిత్రాల కోసం ఎంపిక చేసుకునే హక్కు నిర్మాతలకే ఉంటుందని ఛాంబర్ స్పష్టం చేసింది. ఈ షరతులను ఫెడరేషన్ అంగీకరిస్తే, వేతన పెంపుపై నిర్మాతలు ఓ వ్యూహాన్ని ప్రతిపాదించారు. రోజుకు రూ.2000కి తక్కువగా సంపాదించే కార్మికుల వేతనాలను తక్షణమే 10 శాతం పెంచేందుకు సన్నద్ధత ప్రకటించారు. అంతేకాదు, వచ్చే ఏడాది నుంచి మరో 5 శాతం, ఆపై మరో ఏడాది తర్వాత మరోసారి 5 శాతం పెంపు కూడా వృద్ధి ప్రణాళికలో భాగంగా ఉంది.

కాగా, రూ.2000 నుండి రూ.5000 మధ్యలో వేతనం పొందుతున్న కార్మికులకు వరుసగా మూడేళ్లపాటు ప్రతి ఏడాది 5 శాతం చొప్పున పెంపు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, తక్కువ బడ్జెట్ చిత్రాలకు మాత్రం ఈ పెంపు వర్తించదని ఛాంబర్ స్పష్టం చేసింది. అలాంటి చిత్రాల విషయంలో ప్రస్తుత వేతనాలే కొనసాగుతాయని పేర్కొంది. ఇది చిన్న నిర్మాతలకు ఊరట కలిగించే అంశంగా కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే, మరోవైపు ఫిల్మ్‌ ఫెడరేషన్ సోమవారం తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన 24 కార్మిక సంఘాలతో కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఫిల్మ్‌ ఛాంబర్‌ పంపిన లేఖపై, అందులో పేర్కొన్న షరతులపై చర్చ జరగనుంది. వేతనాల పెంపు, పని పరిస్థితులపై ఉమ్మడి నిర్ణయానికి వస్తారా లేదా అన్నది పరిశ్రమ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఈ చర్చలతో కార్మికుల భవితవ్యంపై, సినిమా ఉత్పత్తి ఖర్చులపై ప్రభావం ఎంత పడుతుందన్న దానిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. వేతనాల పెంపు నిజంగా ఆవశ్యకమా? లేక ఉత్పత్తి వ్యయాలపై అదనపు భారం మోపుతుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశముంది.

Read Also: Jammu and Kashmir : మళ్లీ మేఘ విస్ఫోటం కలకలం ..నలుగురు మృతి, సహాయ చర్యలు ముమ్మరం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • film chamber
  • Film Federation
  • Percentage method
  • Salary increase issue
  • Telugu Film Chamber of Commerce
  • Telugu Film Industry
  • workers

Related News

Working Hrs

Increase Working Hours : ఏపీలో రోజువారీ పని గంటలు పెంపు

Increase Working Hours : అంతేకాకుండా రాత్రి పూట డ్యూటీ చేసే మహిళలకు యజమానులు తప్పనిసరిగా ట్రావెల్ సదుపాయాన్ని, భద్రతా ఏర్పాట్లను కల్పించాలని నిబంధించారు. ఈ సవరణల వల్ల ఒకవైపు కంపెనీల ఉత్పాదకత పెరుగుతుందని నిపుణులు చెబుతుండగా,

    Latest News

    • ‎Cloves: భోజనం తర్వాత రోజు రెండు లవంగాలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

    • ‎Weight Loss: గ్రీన్‌ టీ, మునగాకు టీ.. బరువు తగ్గాలి అనుకున్న వారికి ఏది మంచిదో తెలుసా?

    • ‎Chia Seeds: చియాసీడ్స్‌తో ఇలా చేస్తే చాలు.. సీరమ్ తో పనిలేకుండా మీ చర్మం మెరిసిపోవడం ఖాయం!

    • ‎Lakshmi Devi: లక్ష్మిదేవి అనుగ్రహం కావాలా.. అయితే తప్పకుండా వీటిని పూజించాల్సిందే!

    • ‎Negative Enegry: మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఈ వస్తువులను తొలగించాల్సిందే.. అవేటంటే!

    Trending News

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

      • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

      • OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

      • Gold Rate Hike: బంగారం ధ‌ర‌లు త‌గ్గుతాయా? పెరుగుతాయా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd