Pawan Kalyan: ఓజీ సినిమాలో పవన్ పేరు అదే.. పవర్ ఫుల్ డైలాగ్ లీక్?
- Author : Sailaja Reddy
Date : 24-03-2024 - 7:00 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్గా పాల్గొంటున్నారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టారు పవన్. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆయన చేస్తోన్న సినిమాల్లో ఓజీ సినిమా కూడా ఒకటి. ఆ మూవీకి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. దానయ్య నిర్మిస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తరచూ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న ఓజీ మూవీకి సంబంధించిన షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభం అయిన విషయం తెలిసిందే. కాగా ఈ OG సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. నేడు ఇమ్రాన్ హష్మీ పుట్టిన రోజు కావడంతో ఓజీ సినిమా నుంచి బర్త్ డే విషెష్ తెలుపుతూ ఇమ్రాన్ హష్మీ పోస్టర్ రిలీజ్ చేసారు. పోస్టర్ పై హ్యాపీ బర్త్ డే టు ఓమి భాయ్ అని రాసుంది.
Gambheeraaaa, Nuvvu thirigi Bombay vasthunnaavani vinnaa!! Promise, Iddari lo oka thala ye migultundi…#TheyCallHimOG@PawanKalyan #Sujeeth @priyankaamohan @iam_arjundas @MusicThaman @dop007 @NavinNooli @DVVMovies @SonyMusicSouth #FireStormIsComing pic.twitter.com/jfdhKsmQt8
— Emraan Hashmi (@emraanhashmi) March 24, 2024
దీంతో ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ ఓమి భాయ్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఇదే పోస్టర్ ని ఇమ్రాన్ హష్మీ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. గంభీరా, నువ్వు తితిగి బాంబే వస్తున్నావని విన్నా,ప్రామిస్ ఇద్దరిలో ఒక తలే మిగులుతుంది అని OG సినిమా డైలాగ్ పోస్ట్ చేశారు. దీంతో ఈ డైలాగ్ వైరల్ గా మారింది. ఒక్క డైలాగ్ తోనే సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. ఈ డైలాగ్ తో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పేరు ఈ సినిమాలో గంభీరా నా లేదా విలన్ అలా పిలుస్తాడా అంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సింద మరి.