హీరోగా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల!
ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఏమిటంటే హీరోగా నటిస్తూనే దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఒక నటుడిగా ఆయన ప్రతిభను వెండితెరపై చూడాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
- Author : Gopichand
Date : 15-01-2026 - 5:26 IST
Published By : Hashtagu Telugu Desk
Yellamma Glimpse: ‘బలగం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న దర్శకుడు వేణు యెల్దండి తన రెండో ప్రయత్నంగా ‘ఎల్లమ్మ’ అనే గ్రామీణ నేపథ్య కథను ఎంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మొదట్లో రకరకాల వార్తలు వినిపించాయి. ముందుగా నేచురల్ స్టార్ నాని, ఆ తర్వాత నితిన్ ఈ చిత్రంలో నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే కొన్ని తెలియని కారణాల వల్ల వారు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి.
అధికారిక ప్రకటన
తాజాగా ఈ ఊహాగానాలన్నింటికీ స్వస్తి చెబుతూ చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘ఎల్లమ్మ’ చిత్రానికి సంబంధించిన ‘ఫస్ట్ గ్లింప్స్’ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ద్వారా దేవిశ్రీ ప్రసాద్‌ను ‘పార్శి’ అనే పాత్రలో పరిచయం చేశారు. ఈ వీడియోలోని విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ లుక్ చాలా కొత్తగా మునుపెన్నడూ చూడని విధంగా ఉంది. ఆయన బాడీ లాంగ్వేజ్, గెటప్ ఒక రా అండ్ రస్టిక్ ఫీల్‌ను కలిగిస్తున్నాయి.
Also Read: బడ్జెట్ 2026.. ప్రధాన మార్పులివే?!
సాంకేతిక వర్గం- నిర్మాణం
ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఏమిటంటే హీరోగా నటిస్తూనే దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఒక నటుడిగా ఆయన ప్రతిభను వెండితెరపై చూడాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజికల్ రైట్స్‌ను ప్రముఖ సంస్థ టి-సిరీస్ (T-Series) దక్కించుకుంది.