Ramcharan Shocked: మెగా హీరో మళ్లీ వెయిట్ చేయాల్సిందే!
దర్శకుడు శంకర్ ఇటీవలే రామ్ చరణ్ సినిమా షూటింగ్‌ని నిలిపివేస్తూ "భారతీయుడు 2"ని స్టార్ట్ చేశాడు.
- By Balu J Published Date - 05:49 PM, Wed - 7 September 22

దర్శకుడు శంకర్ ఇటీవలే రామ్ చరణ్ సినిమా షూటింగ్‌ని నిలిపివేస్తూ “భారతీయుడు 2″ని స్టార్ట్ చేశాడు. చెన్నైలో షూటింగ్ శరవేగంగా సాగుతోంది. షెడ్యూల్‌ను మరింత పొడిగించారు. శంకర్ కోసం రామ్ చరణ్ మళ్లీ వెయిట్ చేయాల్సిందే. రామ్ చరణ్, శంకర్ ల సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే శంకర్ చెన్నైలో కాజల్ అగర్వాల్‌తో మరో లెంగ్తీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు. కమల్ హాసన్ సినిమాను పూర్తి చేయడం శంకర్ కు టాస్క్ గా మారింది.
కాబట్టి, రామ్ చరణ్ సినిమాని పునఃప్రారంభించడానికి శంకర్ హైదరాబాద్‌కు తిరిగి రావడం కష్టమే మరి. మరోవైపు, రామ్ చరణ్ మరో సినిమా ప్రారంభించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కార్యరూపం దాల్చడం లేదు. చరణ్ ఇతర దర్శకులతో చర్చలు జరుపుతున్నాడు. కానీ వారిలో ఎవరూ ఇంకా ఆసక్తికరమైన కథలను వివరించలేదు. రామ్ చరణ్, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ఆగిపోయింది. శంకర్ కారణంగా మెగా హీరో ఖాళీగా ఉండాల్సి వస్తోంది. రామ్ చరణ్ సో సాడ్.