Akhanda 2 : బాలకృష్ణ- బోయపాటి మధ్య విభేదాలా..? అఖండ 2 ఆగిపోయిందా..? క్లారిటీ ఇదే !
Akhanda 2 : ఈ చిత్రం షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు (Balakrishna Clash) చోటు చేసుకున్నాయంటూ వార్తలు వెలువడ్డాయి
- By Sudheer Published Date - 02:20 PM, Thu - 10 April 25

నందమూరి బాలకృష్ణ (Balakrishna) మరియు బోయపాటి శ్రీను (Boyapatisrinu) కలయికలో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ (Akhanda 2 ) సినిమాపై ఇటీవల టాలీవుడ్‌లో పలు రకాల రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రం షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు (Balakrishna Clash) చోటు చేసుకున్నాయంటూ వార్తలు వెలువడ్డాయి. దీనివల్ల షూటింగ్ నిలిచిపోయిందనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘అఖండ’ వంటి భారీ హిట్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో, ఈ రూమర్లు అభిమానుల్లో నిరాశను కలిగించాయి.
Pink or White Salt: రాతి ఉప్పు vs అయోడిన్ ఉప్పు: ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుంది?
ఇలాంటి వార్తల నేపథ్యంలో సినీ వర్గాలు స్పందించాయి. బాలకృష్ణ మరియు బోయపాటి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, వీరిద్దరూ సమన్వయంతో ముందుకు సాగుతున్నారని స్పష్టం చేశాయి. ‘అఖండ 2’ షూటింగ్ సజావుగా జరుగుతోందని, ఏ మాత్రం అంతరాయం కలగలేదని స్పష్టం చేశారు. పైగా చిత్రబృందం కథకు తగినట్లుగా గ్రాండ్ స్కేల్‌లో ప్లానింగ్ చేస్తూ, అన్ని విభాగాల్లో శ్రద్ధ చూపుతున్నట్లు వెల్లడించారు.
ఇక ఈ చిత్రం గురించి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘అఖండ’లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం, పవర్‌ఫుల్ డైలాగ్స్, మ్యూజిక్ ఇలా అన్ని బాగా వక్ కావడం తో ఇప్పుడు సీక్వెల్‌పై ఆసక్తి మరింత పెరిగింది. బోయపాటి శ్రీను మరోసారి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి న్యాయం చేయబోతున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘అఖండ 2’ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్ పార్ట్ లో ఉన్న చాలా మంది నటీనటులు ఇందులోనూ కంటిన్యూ అవుతున్నారు. ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాని నిర్మిస్తున్నారు.