Deepika Padukone Baby News: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె..!
దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ తల్లిదండ్రులు అయ్యారు. దీపికకు ఓ కూతురు పుట్టింది. నటి శనివారం మధ్యాహ్నం ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చేరారు. ఆమెతో పాటు రణవీర్ సింగ్, అతని కుటుంబం కూడా ఉన్నారు.
- By Gopichand Published Date - 01:25 PM, Sun - 8 September 24
Deepika Padukone Baby News: బాలీవుడ్ సెలబ్రిటీ జోడీ దీపికా పదుకొణె-రణ్‌వీర్ సింగ్ తల్లిదండ్రులయ్యారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆదివారం ఉదయం దీపికా పదుకొణె (Deepika Padukone Baby News) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. మరోవైపు ఈ జంటకు అభినందనలు తెలుపుతూ పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ తల్లిదండ్రులు అయ్యారు. దీపికకు ఓ కూతురు పుట్టింది. నటి శనివారం మధ్యాహ్నం ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చేరారు. ఆమెతో పాటు రణవీర్ సింగ్, అతని కుటుంబం కూడా ఉన్నారు. అంతకుముందు సెప్టెంబర్ 6న దీపిక బప్పా దర్శనం కోసం సిద్ధివినాయక ఆలయానికి చేరుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న దీపిక తన గర్భాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది. ఆమె ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. సెప్టెంబర్ 2024లో తాను బిడ్డకు జన్మనిస్తానని రాసింది.
Also Read: India Squad For Bangladesh: బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్.. వచ్చే వారమే జట్టు ఎంపిక
శుక్రవారం మధ్యాహ్నం భర్త రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి దీపిక సిద్ధివినాయక ఆలయానికి చేరుకుంది. ఈ సమయంలో దీపిక ఆకుపచ్చ చీరలో కనిపించగా, రణవీర్ కుర్తా-పైజామాలో కనిపించాడు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఇరువురి కుటుంబీకులు కూడా పాల్గొన్నారు. వారిద్దరికీ సంబంధించిన చాలా వీడియోలు కూడా బయటపడ్డాయి. అందులో రణవీర్ గర్భవతి అయిన దీపికకు మద్దతుగా కనిపించాడు. కొద్ది రోజుల క్రితం దీపిక తన గర్భధారణ ఫోటోషూట్ కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నటి సోమవారం సాయంత్రం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 14 ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను పంచుకోవడం ద్వారా దీపికా, ఒక విధంగా తన గర్భం ఫేక్ అని పిలిచే వారికి సమాధానం ఇచ్చింది. ఇంతకుముందు మీడియా నివేదికలలో,నటి డెలివరీ తేదీ సెప్టెంబర్ 28 అని తెలిపారు.
2018లో ఇటలీలో దీపికా- రణ్‌వీర్ డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. దీపికా పదుకొణె 2018లో రణవీర్ సింగ్‌ని పెళ్లాడింది. వీరిద్దరూ తొలిసారిగా ‘గోలియోన్ కి రాస్లీలా: రామ్‌లీలా’ సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. కలిసి పనిచేస్తున్నప్పుడు వారిద్దరూ ప్రేమలో పడ్డారు. 5 సంవత్సరాల ప్రేమ తర్వాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ‘గోలియోన్ కి రాస్లీలా: రామ్‌లీలా’, ‘పద్మావత్’, ‘బాజీరావ్ మస్తానీస, ’83’ చిత్రాల్లో దీపిక, రణ్‌వీర్‌లు కలిసి కనిపించారు. ఇది కాకుండా రణవీర్ చిత్రం ‘సర్కస్’లో కూడా దీపిక అతిధి పాత్రలో నటించింది.