Food Subsidies: కేంద్రం సబ్సిడీలపై సంచలన నివేదిక.. హైరేంజులో ఆహార సబ్సిడీలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లోని తొలి 9 నెలల్లో కేంద్ర సర్కారు మొత్తం సబ్సిడీ(Food Subsidies) వ్యయం రూ.3.07 లక్షల కోట్లు.
- By Pasha Published Date - 04:46 PM, Sat - 15 February 25

Food Subsidies: మనదేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల సబ్సిడీలపై భారీగా నిధులను వెచ్చిస్తున్నాయి. ఉచిత హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఒకవేళ ఉచిత హామీలను అమలు చేయకుంటే.. ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందనే ఆందోళన ప్రభుత్వాలను వెంటాడుతోంది. 2024- 2025 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు(9 నెలల్లో) కేంద్ర ప్రభుత్వం సబ్సిడీల కోసం మొత్తం రూ .3.07 లక్షల కోట్లను ఖర్చు చేసింది. ఇందులో ఆహార సబ్సిడీలే 50 శాతానికిపైగా ఉండటం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఆహార సబ్సిడీల కోసం కేంద్రం రూ .1.64 లక్షల కోట్లను కేటాయించింది. ఈమేరకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక అధ్యయన నివేదికను విడుదల చేసింది.
Also Read :Telanganas Power Games : తెలంగాణలో రాజకీయ కుతంత్రాలు.. ఏఐసీసీ డ్రామా, బీజేపీ బీసీ వ్యూహం, ‘సున్నా’ బిల్లు షాక్
అంతక్రితం ఏడాదిలో..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లోని తొలి 9 నెలల్లో కేంద్ర సర్కారు మొత్తం సబ్సిడీ(Food Subsidies) వ్యయం రూ.3.07 లక్షల కోట్లు. క్రితం ఆర్థిక సంవత్సరం(2023-2024) ఇదే సమయంలో(9నెలల్లో) కేంద్రం వెచ్చించిన సబ్సిడీ బడ్జెట్ కంటే ఇది చాలా ఎక్కువ. 2023-2024 ఆర్థిక సంవత్సరంలోని మొదటి తొమ్మిది నెలల్లో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ వ్యయం రూ.2.77 లక్షల కోట్లుగా ఉంది. ఇక 2022-2023 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబరు కాలంలో రూ .3.51 లక్షల కోట్లను సబ్సిడీల కోసం కేటాయించారు.
Also Read :Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోని ఐకానిక్ ఆర్చ్‌లు ఇక కనిపించవు.. ఎందుకంటే..
ఎరువుల విషయంలో..
ఎరువుల విషయంలో పరిస్థితి ఇందుకు పూర్తి డిఫరెంటుగా ఉంది. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఎరువుల సబ్సిడీలపై వ్యయం కొంతమేర తగ్గిపోయింది. 2024 ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో ప్రభుత్వం ఎరువుల సబ్సిడీల కోసం రూ .1.36 లక్షల కోట్లను వెచ్చించింది. ఎరువుల సబ్సిడీల కోసం 2023-2024 ఆర్థిక సంవత్సరంలోని తొలి 9 నెలల్లో రూ .1.41 లక్షల కోట్లను, 2022-2023 ఆర్థిక సంవత్సరంలోని తొలి 9 నెలల్లో రూ .1.81 లక్షల కోట్లును కేంద్ర సర్కారు ఖర్చు చేసింది.
2024-2025 సంవత్సరం తొలి 9 నెలల్లో..
- ఆస్తుల అమ్మకాలు, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోయింది.
- ప్రభుత్వ రుణేతర మూలధన రాబడులు తగ్గిపోయాయి.
- దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) ప్రవాహం తగ్గింది.