Balakrishna Unstoppable : అన్ స్టాపవుల్ 4 కి మొదటి గెస్ట్ లు వీరేనా..?
Balakrishna Unstoppable సీజన్ 4 మరింత కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. అన్ స్టాపబుల్ సీజన్ 4 మొదటి గెస్ట్ లుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
- By Ramesh Published Date - 06:20 AM, Fri - 18 October 24

నందమూరి బాలకృష్ణ ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రియాలిటీ షో హోస్ట్ చేస్తున్నాడు. అసలు బాలయ్యతో అన్ స్టాపబుల్ షో చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందో కానీ అది నెక్స్ట్ లెవెల్ లో క్లిక్ అయ్యింది. ఓటీటీ స్పెషల్ చిట్ చాట్ షో అన్ స్టాపబుల్ షో ఎన్నో రికార్డులను కొత్తగొట్టింది. 3 సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న Balakrishna అన్ స్టాపబుల్ షో ఇప్పుడు నాలుగో సీజన్ కు రెడీ అవుతుంది.
ఈమధ్యనే సీజన్ 4 (Unstoppable 4) కి సంబందించిన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఐతే సీజన్ 4 మరింత కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. అన్ స్టాపబుల్ సీజన్ 4 మొదటి గెస్ట్ లుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు వస్తున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విడివిడిగా ఈ షోకి వచ్చారు.
అన్ స్టాపబుల్ సీజన్ 4 లో ఇద్దరు కలిసి..
ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 4 లో ఇద్దరు కలిసి రాబోతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇక ఈ సీజన్ లో గెస్ట్ లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంది. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, ఎన్ టీ ఆర్ ఇలా వీరందరినీ ఈ షోకి తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు.
ఏది ఏమైనా అన్ స్టాపబుల్ షో నందమూరి ఫ్యాన్స్ కి తెలుగు ఆడియన్స్ కి మంచి కిక్ ఇస్తుందని చెప్పొచ్చు. ఆహా ఓటీటీ లో ప్రసారం కానున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
Also Read : Tollywood Producer : పోలీసులపైనే దాడి చేసిన సినీ నిర్మాత