Tollywood Producer : పోలీసులపైనే దాడి చేసిన సినీ నిర్మాత
Tollywood Producer : నన్ను పోలీస్ స్టేషన్‌కి పిలుస్తావా అంటూ ఇన్‌స్పెక్టర్‌పై శివరామకృష్ణ దాడి చేసారు.రామకృష్ణ తో పాటు అతని అనుచరులు.. ఇన్‌స్పెక్టర్ సహా మిగితా పోలీసుల మీద దాడికి పాల్పడినట్లు సమాచారం.
- Author : Sudheer
Date : 17-10-2024 - 9:02 IST
Published By : Hashtagu Telugu Desk
వివాదాలకు చిత్రసీమ (Tollywood) ప్రముఖులు దూరంగా ఉంటారు..ముఖ్యంగా పోలీసుల విషయంలో..అలాంటిది తెలుగు నిర్మాత మాత్రం ఏకంగా పోలీసులపైనే దాడి చేసి వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ తన అనుచరులతో కలిసి ఓయూ పోలీస్ స్టేషన్‌లో హంగామా చేశారు.
ఓ కేసు విషయమై నిర్మాత శివరామకృష్ణ (Burugapally Siva Rama Krishna)ను ఇన్‌స్పెక్టర్ పోలీస్ స్టేషన్ (OU Police Station)కు పిలిపించారు. అయితే నన్ను పోలీస్ స్టేషన్‌కి పిలుస్తావా అంటూ ఇన్‌స్పెక్టర్‌పై శివరామకృష్ణ దాడి చేసారు.రామకృష్ణ తో పాటు అతని అనుచరులు.. ఇన్‌స్పెక్టర్ సహా మిగితా పోలీసుల మీద దాడికి పాల్పడినట్లు సమాచారం.
ఈ ఘటనపై సీరియస్ అయిన పోలీసు ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు. నిర్మాత సహా అతని వెంట ఉన్న అనుచరుల మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక శివరామకృష్ణ సినీ కెరియర్ విషయానికి వస్తే..సీతారత్నం గారి అబ్బాయి అనే సినిమాతో నిర్మాతగా మారిన ఈయన.. అందరి బంధువయ, మహేశ్ బాబుతో యువరాజు, వెంకటేశ్ తో ప్రేమంటే ఇదేరా, రవితేజ తో దరువు , యువత, రైడ్, ఏమో గుర్రం ఎగురావచ్చు వంటి సినిమాలను నిర్మించారు.
Read Also : Air India : ముంబయి-లండన్ ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు..