HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Chandra Mohan Died

Chandra Mohan Died : సినీ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన..హైదరాబాద్ అపోలో హాస్పటల్ లో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు

  • Author : Sudheer Date : 11-11-2023 - 10:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandramohan Dies
Chandramohan Dies

చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ (Chandramohan) (82) తుది శ్వాస విడిచారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన..హైదరాబాద్ (Hyderabad) అపోలో హాస్పటల్ (Apolo Hospital) లో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. కథానాయకుడిగా 175 పైగా చిత్రాల్లో నటించారు. మొత్తం 932 సినిమాల్లో నటించి మెప్పించాడు. 1966లో రంగులరాట్నం చిత్రంతో చంద్రమోహన్ సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటి నుండి సహనాయకుడిగా, కథనాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటాడు.

We’re now on WhatsApp. Click to Join.

క్రొత్త హీరోయన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను పేర్కొంటారు. సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్‌తో నటించి తరువాత తారాపథంలో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. చంద్రమోహన్ కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో 1942, మే 23న మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు జన్మించారు. ఇతని అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. ఈయన వ్యవసాయ కళాశాల, బాపట్లలో బి.యస్.సి. పూర్తిచేసి, కొంతకాలం ఏలూరులో పనిచేశాడు. సినిమాలలో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు చేరి ప్రయత్నించారు. హీరోగా రంగులరాట్నం (1966) చిత్రంతో మొదలుపెట్టి, హాస్య నటుడిగా మారి తర్వాత కాలంలో కారెక్టర్ నటుడిగా చిత్రసీమలో స్థిరపడ్డారు.

చంద్రమోహన్ నటించిన కొన్ని చిత్రాలు సుఖదుఃఖాలు, పదహారేళ్ళ వయసు, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి మొదలైనవి హిట్ కొట్టాయి. శ్రీదేవి, మంజుల, రాధిక, జయప్రద, జయసుధ, ప్రభ, విజయశాంతి, తాళ్ళూరి రామేశ్వరి మొదలైన వారు చంద్రబాబు తో జత కట్టి స్టార్ హీరోయిన్స్ గా ఓ వెలుగు వెలిగారు. ఇక ఈయన మరణం పట్ల సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఈయన అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు చెపుతున్నారు.

Read Also : Fire Breaks Out in Crackers Shop : రాజేంద్ర నగర్‌లోని క్రాకర్స్ షాప్ లో భారీ అగ్నిప్రమాదం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chandramohan
  • Chandramohan age
  • Chandramohan dies
  • Chandramohan movies
  • tollywood

Related News

Good news for NTR fans: Time fixed for the 'God of War' announcement.

NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ పేరుతో చాలా ఏళ్లుగా ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. మైథలాజికల్ జోనర్‌లో భారీ స్కేల్‌లో రూపొందించాలని ప్లాన్ చేసుకున్నారు. సితార నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ ప్రాజెక్టును ఎప్పుడో కన్ఫర్మ్ చేశారు. పలు సందర్భాల్లో ఈ మూవీ గురించి చెప్పి, అందరిలో ఆసక్తిని రేకెత్తించారు. జూనియర్ ఎన్టీఆర్ తో ఉంటుం

    Latest News

    • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని అందుకే ఆడించలేదా?

    • Relationship: ఇలా మీ పార్ట్‌నర్‌తో కలిసి బిగికౌగిట్లో నిద్రపోతే చాలు, డాక్టర్ అవసరం లేదు…!!

    • Us-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు నిలిపివేయాలని ఒప్పందం

    • Calcium Deficiency: కాల్షియం లోపిస్తే… ఏమవుతుందో తెలుసా?

    • Cm ChandraBabu: సీఎం చంద్రబాబు రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు..

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd