Allu Arjun : బోయపాటితో అల్లు అర్జున్.. స్కంద చూశాక కూడా ఛాన్స్ ఉంటుందా..?
Allu Arjun సరైనోడు సినిమాతో సూపర్ కాంబోగా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన బోయపాటి శ్రీను అల్లు అర్జున్ కాంబో రిపీట్ అవుతుందని కొన్నాళ్లుగా చర్చ
- By Ramesh Published Date - 10:59 AM, Sun - 26 November 23

Allu Arjun సరైనోడు సినిమాతో సూపర్ కాంబోగా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన బోయపాటి శ్రీను అల్లు అర్జున్ కాంబో రిపీట్ అవుతుందని కొన్నాళ్లుగా చర్చ జరుగుతుంది. అయితే ఈ కాంబో సినిమాపై అల్లు ఫ్యాన్స్ అంతగా ఆసక్తిగా లేరన్నది వాస్తవం. బోయపాటి సినిమా అంటే ఊర మాస్ గా ఉంటాయి. కానీ అందులో కథ కథనాలు రొటీన్ గానే ఉంటాయి. రీసెంట్ గా వచ్చిన స్కంద సినిమా మరోసారి బోయపాటి కి ఫెయిల్యూర్ అందించింది. అఖండ తర్వాత బోయపాటి చేసిన ఈ సినిమా నిరాశపరచింది.
స్కంద హిట్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ అల్లు అర్జున్ బోయపాటి శ్రీను సినిమా అంటే ఫ్యాన్స్ మాత్రం నాట్ ఇంట్రెస్టెడ్ అనేస్తున్నారు. పుష్ప 2 తో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్న అల్లు అర్జున్ ఆ నెక్స్ట్ త్రివిక్రం తో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత బోయపాటి శ్రీను సినిమా ఉండే అవకాశం ఉంది.
రీసెంట్ గా కోట బొమ్మాళి ఈవెంట్ కి కూడా బోయపాటి గెస్ట్ గా వచ్చాడు. ఆయన గురించి అల్లు అరవింద్ గొప్పగా చెప్పుకొచ్చారు. సో సమీకరణాలు చూస్తుంటే అల్లు హీరోతో బోయపాటి సినిమా కన్ ఫర్మ్ అయినట్టే అనిపిస్తుంది. అయితే ఈ కాంబో ఎప్పుడు వస్తుంది ఈసారి ఈ ఇద్దరు ఎలాంటి సినిమా చేస్తారన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
We’re now on WhatsApp : Click to Join
Also Read : Adikeshava : శ్రీలీలకు ఊహించని షాక్ ఇది..!