Salman Congrats Chiru: మై డియర్ చిరు, ఐ లవ్ యూ.. మనం హిట్ కొట్టాం!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ మూవీ పాజిటివ్ టాక్ దూసుకుపోతోంది.
- By Balu J Published Date - 11:49 AM, Thu - 6 October 22

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. టాలీవుడ్ కు గుడ్ ఫాదర్ అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీలో గెస్ట్ రోల్ లో కనిపించిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేశారు. గాడ్ ఫాదర్ కు అన్నిచోట్లా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ‘మై డియర్ చిరు గారూ, ఐ లవ్ యూ’ అంటూ సల్మాన్ స్పందించాడు.
“గాడ్ ఫాదర్ బాగా పనిచేస్తున్నారని నేను విన్నాను, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చిరు గారు క్యూంకీ ఇస్స్ దేశ్ ఔర్ ఇస్స్ దేశ్ కీ జాంతా మై హై బదా దమ్ అని మీకు తెలుసు. (ఎందుకంటే ఈ దేశం, పౌరులు చాలా శక్తివంతులు) అంటూ సల్మాన్ క్యాప్షన్ ఇచ్చారు. మోహన్ రాజా డైరెక్షన్ లో రామ్ చరణ్, R. B. చౌదరి, N. V. ప్రసాద్‌లు సంస్థలు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్‌పై గాడ్ ఫాదర్ ను నిర్మించారు. గాడ్ ఫాదర్ రిమేక్ లూఫిసర్ సినిమా 2019 మలయాళంలో విడుదలైంది. ఒరిజినల్ మూవీ అందర్నీ ఆకట్టుకుంది.
Related News

Netflix CEO Ted Sarandos: మొన్న చిరంజీవి, నిన్న ఎన్టీఆర్.. నేడు మహేశ్‌బాబు
వరల్డ్ లోనే టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ ఇండియాలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ మేరకు ఆయన టాలీవుడ్ హీరోలను వరుసగా కలుస్తున్నారు. మొన్న చిరంజీవి, నిన్న ఎన్టీఆర్.. నేడు మహేశ్‌బాబుతో నెట్‌ఫ్లిక్స్ సీఈవో భేటీ అయ్యారు.