Pushpa 2 Effect : ఇక పై తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి లేవు – మంత్రి కోమటిరెడ్డి
Benefit Shows Ban in Telangana : పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలో ఓ మహిళా మృతి చెందడం , పలువురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరడం వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని (Benefit Shows Cancelled) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు
- By Sudheer Published Date - 10:58 AM, Fri - 6 December 24

సంధ్య థియేటర్లో (Sandhya Theater) పుష్ప 2 బెనిఫిట్ షో(Pushpa 2 Benifit Show) సందర్బంగా జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనతో ప్రభుత్వం కీలక నిర్ణయం (Telangana Govt) తీసుకుంది. పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలో ఓ మహిళా మృతి చెందడం , పలువురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరడం వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని (Benefit Shows Cancelled) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. ప్రజల భద్రతే ముఖ్యమని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
సుకుమార్ – అల్లు అర్జున్ కలయికలో తెరకెక్కిన పుష్ప 2 మూవీ నిన్న (డిసెంబర్ 05 ) న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాకపోతే తెలంగాణ సర్కార్ ఒక రోజు ముందే పలు చోట్ల బెనిఫిట్ షోస్ కు అనుమతి ఇచ్చింది. ఈ సందర్బంగా హైదరాబాద్ లోని RTC X రోడ్ లో వేసిన బెనిఫిట్ కు అల్లు అర్జున్ హాజరయ్యాడు. అల్లు అర్జున్ వస్తున్నట్లు ముందుగానే ప్రకటించడం తో అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులు పోటీపడడం తో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాటలో కింద పడిపోయారు. అధిక సంఖ్యలో అభిమానులు ఉండడంతో వారికి ఊపిరాడలేదు. వారిని గమనించిన పోలీస్ సిబ్బంది బయటకు లాగారు. రేవతితో పాటు కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు సీపీఆర్ చేసి దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రేవతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించి శ్రీతేజను మరో ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ఈ ఘటన పై నటుడు అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీ బృందం, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదైంది.
అల్లు అర్జున్ అతి ఉత్సహం వల్ల ఇప్పుడు చిత్రసీమకే ఇబ్బందిగా మారింది. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు ఉన్నాయి. వారంతా బెనిఫిట్ షోస్ వేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మేకర్స్ కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
Read Also : Hopes On Kohli: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. కోహ్లీపై భారీ ఆశలు