Barbie-1 Billion Dollars : “బాక్సాఫీస్”లో బార్బీ మ్యాజిక్.. 8000 కోట్లు దాటిన కలెక్షన్స్
Barbie-1 Billion Dollars : బార్బీ బొమ్మను ఒక క్యారెక్టర్ గా సృష్టించి వార్నర్ బ్రదర్స్ తీసిన "బార్బీ" మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లలో దూసుకుపోతోంది.
- By Pasha Published Date - 09:27 AM, Mon - 7 August 23
Barbie-1 Billion Dollars : బార్బీ బొమ్మను ఒక క్యారెక్టర్ గా సృష్టించి వార్నర్ బ్రదర్స్ తీసిన “బార్బీ” మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లలో దూసుకుపోతోంది.
జులై 21న రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం 3 వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.8200 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది.
ఈ సంవత్సరం ఇంత భారీగా కలెక్షన్స్ సాధించిన రెండో అతిపెద్ద మూవీ “బార్బీ” మాత్రమే.
కామ్‌కాస్ట్ కార్పొరేషన్ నిర్మించిన “ది సూపర్ మారియో బ్రదర్స్” మూవీ ఈ ఏడాది కలెక్షన్లలో నంబర్ 1 ప్లేస్ లో ఉంది. ఏప్రిల్‌లో విడుదలైన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.11వేల కోట్లను వసూలు చేసింది.
బార్బీ బొమ్మలను తయారు చేసి విక్రయించే బొమ్మల తయారీ సంస్థ మాట్టెల్ ఇంక్ భాగస్వామ్యంతో వార్నర్ బ్రదర్స్ సంస్థ “బార్బీ” చిత్రాన్ని నిర్మించింది.
Also read : Today Horoscope : ఆగస్టు 7 సోమవారం రాశి ఫలితాలు.. వీరికి ఒత్తిళ్లు అధికం
పిల్లలతో ఈ మూవీకి వెళ్లొద్దు
‘బార్బీ’ పేరు వినగానే చాలా మంది ఆ సినిమాలో బార్బీ కంటెంట్ ఉందని అనుకుంటున్నారు. కానీ ఈ మూవీ బార్బీ ల్యాండ్ పై ఫోకస్ తో సాగుతుంది. బార్బీ (మార్గాట్ రాబీ), ఆమె ప్రియుడు కెన్ ( ర్యాన్ గోస్లింగ్ ) బార్బీ ల్యాండ్‌లోని కొన్ని వింత ఘటనలపై రీసెర్చ్ చేయడానికి బార్బీ ల్యాండ్ కు వెళతారు. ఇది పిల్లల సినిమా కాదు.. పెద్దల కోసం తీసిన మూవీ. ఇందులోని హాస్యాన్ని పెద్దలే అర్థం చేసుకోగలరు. ఈ మూవీని 13 ఏళ్ల వయస్సుకు పైవాళ్లు చూడొచ్చని సెన్సార్ రిపోర్ట్ ఇచ్చింది. ఇది కేవలం టీనేజర్స్కే సూటబుల్ అని రివ్యూలు చెబుతున్నాయి. పిల్లలతో ఈ మూవీకి వెళ్లకపోవడమే(Barbie-1 Billion Dollars) బెటర్.
Tags
Related News
Tollwood: టాలీవుడ్ బాక్సాఫీస్ కు డల్ వీకెండ్.. ప్రభావం చూపని సినిమాలు
Tollwood: సాధారణంగా, వేసవిని తెలుగు సినిమాలకు గొప్ప సీజన్‌గా పరిగణిస్తారు, కానీ ఈ సంవత్సరం అలా కాదు. టిల్లు స్క్వేర్ భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పటి వరకు 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా విడుదలై రెండు వారాలైంది, చాలా మంది ఇప్పటికే చూశారు. దీంతో కలెక్షన్స్ నెమ్మదిగా తగ్గాయి. విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ మొదటి షో నుండి ప్రతికూల ప్రతిస్పందనలను అందుకుంది. ఇది స�