HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Balayya Akhanda 2 Movie Review

Akhanda 2 Review : బాలయ్య అఖండ 2 మూవీ రివ్యూ!

  • Author : Vamsi Chowdary Korata Date : 12-12-2025 - 9:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Akhanda 2 Review
Akhanda 2 Review

Akhanda 2 : బాలకృష్ణ కెరీర్‌లో అఖండ సినిమా చాలా ప్రత్యేకం. నటన విషయంలోనూ, రికార్డుల విషయంలోనూ ఆ సినిమా బాలయ్య కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ అనగానే ఫ్యాన్స్‌లో కూడా భారీ అంచనాలు.. అసలు బాలయ్యని ఈసారి ఎలా చూపిస్తారో అనే ఉత్కంఠ కనిపించాయి. ఇక దీనికి తగ్గట్లే ట్రైలర్, సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మరి ఈరోజు (డిసెంబర్ 12)న రిలీజైన అఖండ 2: తాండవం.. మొదటి పార్ట్‌ స్థాయిలో ఉందా? లేక అంతకుమించి అనేలా ఉందా? రివ్యూలో చూద్దాం.

కథ వేరుంటది
అఖండ సినిమాకి సీక్వెల్‌గా తీసిన ఈ తాండవం.. అప్పటి కథకి 15 ఏళ్ల తర్వాత ఏం జరిగింది అనే కథతో మొదలవుతుంది. రాయలసీమలో ఎమ్మెల్యేగా ఉన్న బాల మురళీ కృష్ణ (బాలకృష్ణ 1) కుమార్తె జనని (హర్షాలి మల్హోత్రా) డీఆర్డీఓలో ట్రైనీగా ఉంటుంది. 17 ఏళ్లకే ఆమె చేసే పరిశోధనలు చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. అయితే అదే సమయంలో దేశమంతా ఎంతో పవిత్రంగా భావించే మహా కుంభమేళాలో ఒక వైరస్ అటాక్ జరుగుతుంది. దీని వల్ల కోట్లమంది ఎఫెక్ట్ అవుతారు. అయితే తాను కనిపెట్టిన ఒక వ్యాక్సిన్ ద్వారా ఈ వైరస్‌ని అరికట్టవచ్చని జనని గుర్తిస్తుంది.

దీంతో తన సీనియర్ సైంటిస్ట్ (సంయుక్త)తో కలిసి ఈ వ్యాక్సిన్‌ని పెద్ద మొత్తంలో రెడీ చేస్తారు. అయితే ఈ వైరస్ జనానికి చేరకుండదని ఈ సైంటిస్ట్ బృందంపై ఠాగూర్ (కబీర్ దుహాన్ సింగ్) దాడి చేయిస్తాడు. అయితే అప్పటికే కొన్నాళ్లుగా హిమాలయాల్లో తపస్సు చేస్తున్న అఖండ రుద్ర సికందర్ అఘోరా (బాలకృష్ణ 2)కి ఈ విషయాన్ని గ్రహిస్తాడు. జనని ఆపదలో ఉందని తెలుసుకుని తనకి ఆపద వస్తే రక్షిస్తానని ఇచ్చిన మాట కోసం తిరిగి వస్తాడు.

మరి తిరిగి వచ్చిన అఖండ ఏం చేశాడు? అసలు కుంభమేళా సమయంలో గంగలో వైరస్ కలిపింది ఎవరు? దీని వెనుక జరిగిన కుట్ర ఏంటి? ఇందులో విశాచి (ఆది పినిశెట్టి) పాత్ర ఏంటి? విశాచికి అఖండకి ముందే పరిచయం ఉందా? అనే ఈ విషయాలు స్క్రీన్ మీద చూడాల్సిందే.

తమన్ మ్యూజిక్ బాలయ్య మ్యాజిక్
బాలయ్య సినిమాలని భూతద్దంలో పెట్టి చూడటం, లాజిక్స్ వెతకడం కరెక్ట్ కాదు. ఈ విషయం బాలయ్య ఫ్యాన్స్‌కి కూడా బాగా తెలుసు. ఎందుకంటే అసలు థియేటర్‌కి వచ్చేదే బాలయ్య వేసే స్టెప్పులు, ఆ మాస్ ఎలివేషన్స్, డైలాగులు, ఆయన యాక్షన్ చూడటానికి.. ఇక ఇందులో ఇది అలా ఉంది అది ఇలా ఉంది అని పేరు పెట్టడం నందమూరి ఫ్యాన్స్‌ ఎప్పుడో మర్చిపోయారు. వాళ్లకి కావాల్సింది ప్యూర్ బాలయ్య స్టైల్ మ్యాజిక్.. అంతే. ఇక ఈ అఖండ 2: తాండవం.. ఆ విషయంలో ఫ్యాన్స్‌ని ఎక్కడా ఏమాత్రం నిరాశపరచలేదు.

సినిమా ఫస్టాఫ్‌‌లో బాలయ్య 1 ఎంట్రీ, భారత్‌ మీద పక్క దేశం పన్నిన కుట్ర, సంయుక్తతో దొమ్మెలేమో అదిరిపాయె అంటూ బాలయ్య వేసిన మాస్ స్టెప్పులతో అలా అలా బోయపాటి ప్లాన్ చేశాడు. నిజానికి ఫస్టాఫ్ చూస్తున్నంత సేపు ఆడియన్స్‌కి ఏందిరా తాండవం అన్నారు.. ఎక్కడా చప్పుడే లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఎప్పుడైతే అఖండ ఎంట్రీ వస్తుందో అప్పటి నుంచి సినిమా అమాంతం పరిగెడుతుంది.

ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ ఫైట్ ఏదైతే ఉందో.. త్రిశూలం పట్టుకొని బాలయ్య చేసిన ఆ ఫైట్‌కి రివ్యూవర్లే చాలా మంది క్లాప్స్, విజిల్స్‌తో తెగ ఎంజాయ్ చేశారు. ఇక బాలయ్య ఫ్యాన్ అయితే సీట్లో కూర్చోవడం కష్టమే. మంచు కొండల్లో విలన్లను తన శూలంతో బాలయ్య పొడిచి పొడిచి చంపడం.. అక్కడ తమన్ మ్యూజిక్‌తో ఇచ్చిన తాండవం మాములుగా లేదు. అయితే ఇందులో కొంతమంది ఆడియన్స్‌కి లాజిక్స్ కనిపించొచ్చు కానీ బాలయ్య ఫ్యాన్స్‌కి మాత్రం ప్యూర్ మ్యాజిక్ మాత్రమే కనిపిస్తుంది.

దైవభక్తి-దేశభక్తి
ఇక ఇంటర్వెల్‌కి హమ్మయ్య సినిమా అందుకుంది ఇక తాండమే అనుకుంటూ ఆడియన్స్‌ని సెకండాఫ్‌కి తీసుకొచ్చాడు బోయపాటి. ఆ తర్వాత మళ్లీ కాస్త సినిమా స్లో అయినా కూడా సెకండాఫ్‌లో మాత్రం అఖండ విశ్వరూపమే చూపిస్తాడు. అక్కడక్కడా దేశం, ధర్మం, హైందవం, రామాయణం, మహాభారతం, భాగవతం ఇలా ప్రతి దాన్ని టచ్ చేస్తూ పడిన డైలాగులు కూడా థియేటర్లో బాగానే పేలాయి.

ఇక కాంగ్రెస్ సీనియర్ నేతలపై కూడా అక్కడక్కడా సెటైర్లు కూడా వినిపించాయి. ఆది పినిశెట్టి చేసిన విశాచి క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం సినిమాలో అసలు ఫ్రిక్షన్ మొదలైంది. అఖండ-విశాచి మధ్య ముందు జరిగిన గతం.. తర్వాత ఇద్దరి మధ్య జరిగిన ఫైట్ సీన్ కూడా విజిల్స్ వేయించింది. అప్పటివరకూ శూలం పట్టుకొని శివుడిలా తాండవం చేసిన అఖండ.. అక్కడ హనుమంతుడి గద తీసుకొని బాదడం ఇవన్నీ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటాయి.

రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, శివుడు ఓవరాల్‌గా దేవుడి విషయంలో అఖండ చేత చెప్పించిన డైలాగులు.. అసలు భక్తులకి దేవుడిపై ఎందుకు నమ్మకం ఉండాలి అంటూ పడిన సీన్.. భక్తులకి చాలా బాగా అనిపిస్తుంది. కొంతమందికి మాత్రం ఈ సీన్ పెద్దగా ఎక్కకపోయి ఉండొచ్చు. అయితే దైవభక్తిని, దేశభక్తిని రెండింటినీ ఎలివేట్ చేస్తూ రెండింటి మధ్య బోయపాటి చేసిన బ్యాలెన్స్ కూడా బాగానే వర్కవుట్ అయింది. అలానే సెకండాఫ్‌లో అమ్మ సెంటిమెంట్ సీన్లు కూడా బాగా వర్కవుట్ అయ్యాయి. ఇక క్లైమాక్స్‌లో, అంతకుముందు ఒకసారి పడిన శివుడి సీన్లు కూడా ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతాయి.

ఈ విషయాలు మాత్రం
అయితే సినిమాలో అఖండ పాత్రని ఎలివేట్ చేయడానికి చాలా విషయాల్ని బోయపాటి లైట్ తీసుకున్నారు. ముఖ్యంగా ప్రమాదకర వైరస్‌ని అంత ఫుల్ సెక్యూరిటీలో ఉన్న మహా కుంభమేళాలో భక్తుల ముందే గంగానదిలో కలిపే సీన్.. రియాల్టీకి చాలా దూరంగా అనిపిస్తుంది. అలానే మన దేశ సెక్యూరిటీ, ఆర్మీ, సాయుధ బలగాలు ఎవరూ కూడా వీటిని అడ్డుకోలేకపోవడం.. ముఖ్యంగా డీఆర్డీఓకి సంబంధించిన ల్యాబ్‌పైన చాలా సింపుల్‌గా కొంతమంది వచ్చి దాడి చేయడం.. ఇలాంటి సీన్లు చూసినప్పుడు ఇదేందయ్యా అనిపిస్తుంది.

అయితే ఇవి బోయపాటి కావాలని చేశారని చెప్పలేం కానీ ఒక దాన్ని ఎలివేట్ చేయాలనుకున్నప్పుడు తెలీకుండానే ఇతర విషయాలపై చిన్నచూపు పడుతుంది. అలానే దేశ సరిహద్దుల్ని దాటేసి పక్క దేశాల ఆర్మీపైన అఖండ ఒక్కడే విరుచుకుపడటం.. ఇలాంటి సీన్లు చూసినప్పుడు కూడా కొంతమంది ఆడియన్స్‌ ఏంట్రా ఇది అనుకోవచ్చు. కానీ ఫ్యాన్స్‌కి మాత్రం ఇవి బాగా నచ్చుతాయి.

తమన్ తాండవం బాలయ్య విశ్వరూపం
నటన విషయానికొస్తే బాలయ్య మరోసారి అఘోరా పాత్రలో తన నటవిశ్వరూపం చూపించారు. అఖండగా బాలయ్య కనిపించిన ప్రతి సీనులోనూ ఆయన హావభావాలు, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. ఇక ఆది పినిశెట్టి కనిపించింది తక్కువ సేపే అయినా ఆయన లుక్, నటన బాగా అనిపిస్తాయి. ఇక శాశ్వత్ ఛటర్జీ, సంయుక్త, హర్షాలీ, కబీర్, మురళీ మోహన్ ఇలా మిగిలిన వాళ్లంతా తమ పాత్రలకి న్యాయం చేశారు. ముఖ్యంగా దొమ్మలేమో అదిరిపాయె సాంగ్‌లో బాలయ్య స్టెప్పులు, సంయుక్త అందాల ప్రదర్శన రెండూ పోటాపోటీగా ఉన్నాయి.

ఇక అఖండ 2 విషయంలో తమన్‌ని మరోసారి మెచ్చుకొని తీరాలి. ఎందుకంటే బాలయ్య సినిమా అంటే తమన్ డ్యూటీ ఎక్కేయడం కన్ఫార్మ్ అని ఫ్యాన్స్‌కి ఒక బలమైన నమ్మకం ఎప్పుడో వచ్చేసింది. అయితే అఖండ 2 విషయంలో మాత్రం తమన్ డ్యూటీ ఎక్కడం కాదు అసలు చివరివరూక ఎక్కడా డ్యూటీ దిగలేదు.. అనిపిస్తుంది. అసలు అఖండ సీన్లకి తమన్ ఇచ్చిన బీజీఎమ్ అయితే థియేటర్లో స్పీకర్లు పగిలిపోవాలనే కసితో కొట్టినట్లు అనిపించింది.

అలానే బోయపాటి మరోసారి బాలయ్యని తాను ఎంతబాగా ఉపయోగించుకోగలనా అనేది చూపించారు. ఎందుకంటే బాలయ్యని స్క్రీన్ మీద తన ఫ్యాన్స్‌కి నచ్చేలా చూపించడం ఆర్ట్ అయితే బోయపాటి అందులో పెద్ద ఆర్టిస్టే అని చెప్పాలి. ఈ విషయాన్ని మరోసారి బోయపాటి నిరూపించారు. బాలయ్య ఉంటే కథ, కథనంతో పని లేదు.. ఆయన్ని ఫ్యాన్స్ ఇష్టపడేలా చూపిస్తే చాలు అన్న ఒక్క సూత్రాన్ని బోయపాటి పాటించి సక్సెస్ అయ్యారు. ఇక వీఎఫ్ఎక్స్, నిర్మాణ విలువలు, ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ ఇలా అన్నీ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లడానికి బాగా ఉపయోగపడ్డాయి.

నార్త్‌లో అంటుకుంటే మాత్రం
ఈ సినిమా గురించి చివరిగా చెప్పాలనుకున్న మాట ఒక్కటే. కొన్నేళ్లుగా మన దేశంలో హైందవం, దేవుడు, పురాణాలు, మైథాలజికల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చేస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా నార్త్‌లో ఇలాంటి సినిమాలు ఇచ్చిపడేస్తున్నాయి. అఖండ 2 విషయంలో కూడా ఇది జరిగే అవకాశం లేకపోలేదు.

ఎందుకంటే శివుడు, కుంభమేళా, అఘోరా, దేవుడు.. ఇలాంటి విషయాలకి ఉత్తరాదిలో వచ్చే రెస్పాన్స్ వేరే లెవల్‌లో ఉంటుంది. ఏమాత్రం అఖండ 2కి అక్కడ మౌత్ టాక్ దొరికినా ఖచ్చితంగా ఇది బాలయ్య కెరీర్‌లో మొదటి ప్యాన్ ఇండియా హిట్‌గా నిలుస్తుంది. అలానే ఆయన కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ తెచ్చిపెట్టే సినిమాగా రికార్డ్ కొట్టే ఛాన్స్ ఉంది.

ఒక్కమాటలో చెప్పాలంటే.. తమన్ మ్యూజిక్ బాలయ్య మ్యాజిక్.. హాలీవుడ్‌కి అవతార్‌లు, సూపర్ మ్యాన్‌లు ఉండొచ్చు కానీ ఇక్కడ ఉన్నది బాలయ్య.. జై బాలయ్య


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Akhanda 2
  • Akhanda2 Thaandavam
  • balakrishna
  • Balakrishna Boyapati movie
  • Movie Review

Related News

Akhanda 2 Postponed

Akhanda 2 : ‘అఖండ-2’ సినిమాపై హైకోర్టులో మరో పిటిషన్..ఈసారి ఎందుకు అంటే !!

Akhanda 2 : నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ-2' చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఈ సినిమాకు నిన్న ప్రీమియర్ షోలు వేశారంటూ

  • Box Office

    Akhanda 2 Roars At The Box Office : బాలయ్య కెరీర్లోనే అఖండ 2 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.. శివ తాండవమే..!

  • Akhanda 2 Talk

    Akhanda 2 Talk: ‘అఖండ-2’ – బాలయ్య విలయతాండవం

  • Akhanda 2 Tickets

    Akhanda 2 : ‘అఖండ-2’ కు మరో దెబ్బ..బాలయ్య కు ఎవరి దిష్టి తగిలిందో..?

  • Young Telugu Director

    Young Telugu Director: మౌగ్లీ మూవీ వాయిదాపై డైరెక్టర్ సందీప్ రాజ్ ఆవేదన!

Latest News

  • Pawan Kalyan : ఢిల్లీ హైకోర్టులో పవన్ కళ్యాణ్ పిటిషన్

  • Phone Tapping Case : జూబ్లీహిల్స్ పీఎస్ లో లొంగిపోయిన ప్రభాకర్ రావు

  • Grama Panchayat Elections : తెలంగాణ లో మా ప్రభంజనం మొదలైంది – బిఆర్ఎస్

  • Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. దువ్వాడ మాధురి, శ్రీనివాస్ అరెస్ట్?

  • Temples : జీవితంలో ఒక్కసారి ఈ 10 టెంపుల్స్‌ దర్శిస్తే చాలు!

Trending News

    • Akhanda 2 Review : బాలయ్య అఖండ 2 మూవీ రివ్యూ!

    • Sarpanch Salary: తెలంగాణలో సర్పంచుల వేతనం ఎంతో తెలుసా?!

    • Indigo Flight: ఇండిగో ప్రయాణికులకు రూ. 10,000 ట్రావెల్ వోచర్!!

    • Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి కారణం ఏమిటి?

    • IPL Mini Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం.. అత్యధిక ధర పలికేది ఎవరికి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd