Balakrishna NTR : దసరా బరిలో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్.. బాక్సాఫీస్ భారీ ఫైట్..!
Balakrishna NTR సంక్రాంతి తర్వాత సమ్మర్ లో స్టార్ సినిమాల ఫైట్ ఉంటుందని ఆశించిన తెలుగు ఆడియన్స్ కు ఈ సమ్మర్ యువ హీరోలకే వదిలేసినట్టు ఉన్నారు. ఎన్.టి.ఆర్ దేవర, ప్రభాస్ కల్కితో
- Author : Ramesh
Date : 20-02-2024 - 9:14 IST
Published By : Hashtagu Telugu Desk
Balakrishna NTR సంక్రాంతి తర్వాత సమ్మర్ లో స్టార్ సినిమాల ఫైట్ ఉంటుందని ఆశించిన తెలుగు ఆడియన్స్ కు ఈ సమ్మర్ యువ హీరోలకే వదిలేసినట్టు ఉన్నారు. ఎన్.టి.ఆర్ దేవర, ప్రభాస్ కల్కితో ఈ సమ్మర్ సూపర్ గా ఉంటుందని ఆడియన్స్ ఊహించగా దేవర రేసు నుంచి తప్పుకోగా కల్కి రిలీజ్ అవుతుందా లేదా అన్న క్లారిటీ రాలేదు. ఇదిలాఉంటే సమ్మర్ వదిలి స్టార్ సినిమాలన్నీ దసరా బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే దేవర సినిమా అక్టోబర్ 10న రిలీజ్ లాక్ చేశారు.
దసరా ఫెస్టివల్ టార్గెట్ తో మరికొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో నందమూరి నట సిం హం బాలకృష్ణ సినిమా కూడా ఉందని టాక్. కె ఎస్ బాబీ డైరెక్షన్ లో బాలకృష్ణ నటిస్తున్న సినిమా దసరాకి రిలీజ్ ఫిక్స్ చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ రావాల్సి ఉంది. ఆల్రెడీ దేవర దసరా కి ఫిక్స్ చేసుకోగా బాలకృష్ణ కూడా దసరాకి రిలీజ్ అంటే మాత్రం పోటీ రసవత్తరంగా మారుతుంది.
బాబాయ్ అబ్బాయ్ మధ్య బాక్సాఫీస్ ఫైట్ ఆసక్తికరంగా ఉంటుంది. దసరాకి దేవరతో బాలయ్య సినిమా వస్తే మాత్రం నందమూరి ఫ్యాస్ లో టెన్షన్ మొదలైనట్టే అని చెప్పొచ్చు. ఆల్రెడీ దేవర ముందు చెప్పాడు కాబట్టి బాలకృష్ణ సినిమానే వెనక్కి తగ్గాల్సి ఉంటుంది. ఒకవేళ ఆగష్టు 15న పుష్ప 2 రిలీజ్ వాయిదా పడితే అది కూడా దసరాకి టార్గెట్ పెడతారని టాక్. అలా అయితే దేవర ఆగష్టు 15న రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఏది ఏమైనా సంక్రాంతి తర్వాత మరోసారి దసరాకి స్టార్ సినిమాల మధ్య బాక్సాఫీస్ ఫైట్ జరగబోతుందని చెప్పొచ్చు. మరి ఈ ఫైట్ లో ఎవరెవరు నిలుస్తారు.. ఎవరు పై చేయి సాధిస్తారన్నది ఆ టైం కి తెలుస్తుంది.