Atlee : అట్లీ నెక్స్ట్ అల్లు అర్జున్‌తోనే..? సల్మాన్ ఖాన్‌కు కాదా..? వెనుకున్న అసలు కథ ఇదే..!
Atlee : ‘జవాన్’తో బాలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకున్న అట్లీ తన తదుపరి చిత్రాన్ని ఎవరితో చేస్తాడనే ఉత్కంఠ కొనసాగింది. మొదట సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్ పేర్లు వినిపించాయి. అయితే, తాజా సమాచారం మేరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తోనే అట్లీ సినిమా లాక్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇవే..!
- By Kavya Krishna Published Date - 02:22 PM, Wed - 12 February 25

Atlee : ‘జవాన్’తో బాలీవుడ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అట్లీ.. తన తదుపరి సినిమా ఎవరితో చేస్తాడనే ఉత్కంఠ నెలకొని ఉంది. మొదట సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్ పేర్లు బాగా చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పుడు ముంబయి సమాచారం మేరకు అట్లీ-అల్లు అర్జున్ కాంబోనే లాక్ అయినట్టు తెలుస్తోంది. కానీ, దీనికి ముందు అనేక వ్యూహాలు నడిచాయి. అసలు సల్మాన్‌ను ఎందుకు పక్కన పెట్టారు..? అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఎలా ఓకే అయ్యింది..? దీని వెనుక కథేంటో తెలుసుకోవాలి.
400 కోట్ల బడ్జెట్‌కి వెనుకడుగు వేసిన జియో స్టూడియోస్..!
అట్లీ మొదట సల్మాన్ ఖాన్‌ను దృష్టిలో పెట్టుకుని ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. అయితే, ఈ ప్రాజెక్ట్ కోసం కేవలం ప్రొడక్షన్ ఖర్చులకే 400 కోట్లకు పైగా వెచ్చించాల్సి వస్తుందని అంచనా వేసింది జియో స్టూడియోస్. దీంతో, అంత భారీ పెట్టుబడి పెట్టడం సాధ్యమయ్యేలా లేదని, ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టాలని నిర్ణయించింది.
సన్ పిక్చర్స్ కూడా నో చెప్పేసిందా..?
ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్‌కి కూడా తీసుకెళ్లారు. కానీ, అక్కడ కూడా అదే సమాధానం వచ్చిందట. సల్మాన్ ఖాన్‌పై అంత భారీ పెట్టుబడి పెట్టడం ఓ రిస్క్ అనే అభిప్రాయంతో ఆ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఈ నేపథ్యంలో అట్లీ మరో హీరో కోసం వెతికాడు.
అల్లు అర్జున్ అంటే ఎంత బడ్జెట్ అయినా రెడీ..!
ఈ కథను అల్లు అర్జున్‌కు వినిపించగా, ఆయన ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ కూడా బన్నీతో సినిమా అంటే ఎంత బడ్జెట్ అయినా పెట్టేందుకు సిద్ధంగా ఉందని సంకేతాలు ఇచ్చిందట. దీంతో, అట్లీ అండ్ టీమ్ ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టిందని సమాచారం.
ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ కోసం రెడీ అవుతున్నారు. అయితే, ఆ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం అయితే అట్లీ సినిమా ముందుగా సెట్స్‌పై వెళ్లే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. సన్ పిక్చర్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌కి మరింత ఆసక్తి కనబరుస్తుండటంతో అట్లీ బన్నీ సినిమా దాదాపుగా లాక్ అయినట్టే అంటున్నారు. అయితే.. సల్మాన్ ఖాన్-అట్లీ కాంబో పూర్తిగా రద్దు అయిందని మాత్రం చెప్పలేం. వేరొక స్టోరీతో, అంత భారీ బడ్జెట్ డిమాండ్ చేయని కొత్త ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.
ఇదిలా ఉండగా, ‘పుష్ప 2: ది రూల్’ రిలీజై రెండు నెలలు దాటినా.. బన్నీ తన తదుపరి ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఆయన ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడెప్పుడు కొత్త సినిమా మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అట్లీ సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలతో బన్నీ అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. మొత్తానికి, అట్లీ నెక్స్ట్ సినిమా బన్నీతోనే అని ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. అయితే, అధికారిక ప్రకటన కోసం ఇంకా కొంతకాలం వేచి చూడాల్సిందే..!
New Pass Books : ఏపీలో ఏప్రిల్ 1 నుంచి కొత్త పాస్ పుస్తకాల పంపిణీ