Ashika Ranganath : మెగా ఛాన్స్ పట్టేసిన ఆషిక రంగనాథ్.. చిరు విశ్వం భరలో ఛాన్స్..!
Ashika Ranganath కన్నడ భామ ఆషిక రంగనాథ్ తెలుగులో కళ్యాణ్ రాం తో అమిగోస్ సినిమా చేసినా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు కానీ తన సెకండ్ అటెంప్ట్ గా చేసిన నా సామిరంగ సూపర్ హిట్
- Author : Ramesh
Date : 20-02-2024 - 8:52 IST
Published By : Hashtagu Telugu Desk
Ashika Ranganath కన్నడ భామ ఆషిక రంగనాథ్ తెలుగులో కళ్యాణ్ రాం తో అమిగోస్ సినిమా చేసినా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు కానీ తన సెకండ్ అటెంప్ట్ గా చేసిన నా సామిరంగ సూపర్ హిట్ అయ్యింది. కింగ్ నాగార్జున సరసన ఛాన్స్ అందుకున్న అమ్మడు ఆ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. నా సామిరంగ సినిమాలో ఆషిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమాతో తెలుగులో ఆమె క్రేజ్ పెరిగింది.
ఇక ఇదిలాఉంటే ఆషిక రంగనాథ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. వశిష్ట డైరెక్షన్ లో చిరంజీవి చేస్తున్న విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా అవసరం ఉందట. ఇప్పటికే సినిమాలో మీనాక్షి చౌదరి కూడా ఛాన్స్ అందుకుందని టాక్.
ఇప్పుడు ఆషిక రంగనాథ్ కూడా మెగా ఆఫర్ అందుకుందని తెలుస్తుంది. అయితే చిరు సినిమాలో ఆషిక రంగనాథ్ సిస్టర్ రోల్ నటిస్తుందని టాక్. విశ్వంభర సినిమాలో చిరుకి నలుగురు చెల్లెల్లని తెలుస్తుంది. అయితే మరి ఈ యువ హీరోయిన్స్ అంతా కూడా మెగాస్టార్ చిరంజీవి సిస్టర్ గా ఎవరి నటిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఆషిక రంగనాథ్ మాత్రం సినిమాలో సోదరిగా చేస్తే సినిమాకు ప్లస్సే అని చెప్పొచ్చు.
Also Read : Nidhi Agarwal : మెగా ఆఫర్ అందుకున్న భామ.. పవన్ కళ్యాణ్ తర్వాత బిగ్ ఆఫర్..!