Nidhi Agarwal : మెగా ఆఫర్ అందుకున్న భామ.. పవన్ కళ్యాణ్ తర్వాత బిగ్ ఆఫర్..!
Nidhi Agarwal ఇస్మార్ట్ శంకర్ భామ నిధి అగర్వాల్ మరో లక్కీ ఆఫర్ అందుకుందని తెలుస్తుంది. తెలుగులో అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉన్నా కూడా కోలీవుడ్ లో అవకాశాలు అందుకుంటుంది అమ్మడు.
- Author : Ramesh
Date : 20-02-2024 - 8:21 IST
Published By : Hashtagu Telugu Desk
Nidhi Agarwal ఇస్మార్ట్ శంకర్ భామ నిధి అగర్వాల్ మరో లక్కీ ఆఫర్ అందుకుందని తెలుస్తుంది. తెలుగులో అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉన్నా కూడా కోలీవుడ్ లో అవకాశాలు అందుకుంటుంది అమ్మడు. అయితే తెలుగులో పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు ఛాన్స్ అందుకున్నా ఆ మూవీ ఇంకా పూర్తి కాలేదు. చాలా కాలం తర్వాత అమ్మడి మరో తెలుగు ఆఫర్ ని అందుకుంది.
మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది డైరెక్షన్ లో వస్తున్న సినిమా గాంజా శంకర్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ బ్యానర్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా నిధి ఛాన్స్ అందుకోవడంతో అమ్మడి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
నిధి అగర్వాల్ తెలుగులో ఇక సినిమాలు చేయదని అనుకున్న ఆడియన్స్ కి ఆమె మెగా హీరో సాయి తేజ్ సినిమాలో నటించడంపై ఆడియన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు. గాంజా శంకర్ త్వరలో సెట్స్ మీదకు వెళ్తుండగా సినిమాలో నిధి గ్లామర్ సైడ్ కూడా ప్లస్ అవుతుందని అంటున్నారు. ఈమధ్య సినిమా యూనిట్ కి పోలీసులు నోటీసులు అందించారని తెలుస్తుండగా ఆ వివాదం ముగిసినట్టే అని అంటున్నారు.
Also Read : KJQ : దసరా బ్యానర్ లో కింగ్ జాకీ క్వీన్.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ పోస్టర్ అదుర్స్..!