Tollywood: టాలీవుడ్‌లో ఈ ముగ్గురు స్టార్‌లు చులకన అయ్యారా?
బన్నీ జైలు నుంచి విడుదలైన తర్వాత టాలీవుడ్ దర్శక నిర్మాతలు, హీరోలు పరామర్శించారు. దాన్నీ బన్నీ పీఆర్ టీమ్ విపరీతంగా వైరల్ చేసింది. దీంతో ఈ విషయాన్ని గమనించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఖండించారు.
- By Gopichand Published Date - 07:20 PM, Fri - 27 December 24

Tollywood: తెలుగు రాష్ట్రాల్లో గత నెల రోజుల నుంచి టాలీవుడ్ (Tollywood) పెద్దలు నిత్యం ఏదో ఒక వార్తలో నిలుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మంచు మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌లపై విమర్శలు రావడంతో వారు నిత్యం వార్తల్లోకి వస్తున్నారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌కు వెళ్లిన అల్లు అర్జున్ ఆ మూవీ సక్సెస్ ఏ మాత్రం కలిసిరాలేదు. అంతేకాకుండా అల్లు అర్జున్‌పై ఓ నెగిటివ్ ఆలోచన అందరికీ వచ్చేసినట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్‌ను వార్తల్లో ఉంచిన సంధ్య థియేటర్ తొక్కిసలాట
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అని బన్నీ మహిళా అభిమాని మృతిచెందగా.. ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. థియేటర్ ఘటనలో మహిళ మృతిచెందడంతో దానిపై అల్లు అర్జున్ లేటుగా స్పందించి ఆ కుటుంబానికి రూ. 25 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే అసలు కథ అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంతో మొదలైంది. చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఆయన ఇంటికి వెళ్లి మరీ అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. అయితే తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఐకాన్ స్టార్ చంచల్‌గూడ జైలులో ఒక రాత్రి ఉండాల్సి వచ్చింది.
Also Read: Maruti Suzuki Stock: మారుతీ సుజుకీ కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్
బన్నీ జైలు నుంచి విడుదలైన తర్వాత టాలీవుడ్ దర్శక నిర్మాతలు, హీరోలు పరామర్శించారు. దాన్నీ బన్నీ పీఆర్ టీమ్ విపరీతంగా వైరల్ చేసింది. దీంతో ఈ విషయాన్ని గమనించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఖండించారు. అనంతరం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రభుత్వంపై, సీఎం రేవంత్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలు, టిక్కెట్ల ధరలు పెంపుని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం టాలీవుడ్ పెద్దలు అందరూ కలిసి సీఎం రేవంత్‌ను కలిశారు. అయితే ఇదంతా బన్నీ వల్లనే జరిగిందని పలువురు ప్రముఖులు విమర్శలు చేశారు.
మంచు కుటుంబంలో మంటలు
ఇకపోతే సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదం తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకొని ఉన్న పరువును బజారుకు లాక్కున్నారు. ఈ విషయమై కవరేజీ కోసం వెళ్లిన పలువురు జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడంతో అదొక్క కొత్త వివాదానికి తెరతీసింది. అయితే ఇప్పటికీ మంచు కుటుంబంలో లుకలుకలు అలానే ఉన్నాయి. అయితే మంచు మోహన్ బాబు తీరు ఆయన్ని తెలంగాణ సమాజంలో బ్యాడ్ చేసిందని పలువురు మీడియా ముఖంగా చెప్పేశారు.
సాయం చేస్తానన్న తారక్‌పై ఆరోపణలు
చిత్తూరు జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని క్యాన్సర్‌తో పోరాడుతూ దేవర మూవీ రిలీజ్‌కు ముందు నాకు బ్రతకాలని ఉందని వీడియో రిలీజ్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న తారక్ అభిమానికి ధైర్యం చెప్పేందుకు వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పారు. అభిమానిని బ్రతికించుకునే బాధ్యత తనదే అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. అయితే రెండు రోజుల క్రితం క్యాన్సర్‌తో బాధపడుతున్న యువకుడి తల్లి మీడియా సాక్షిగా ఎన్టీఆర్ తమకు ఎటువంటి సాయం లేదని, ఎన్టీఆర్ ఫ్యాన్సే హెల్ప్ చేశారని ఆమె తెలిపింది. దీంతో విషయం తెలుసుకున్న తారక్ రూ. 12 లక్షలు సదరు మహిళకు పంపినట్లు సమాచారం. దీంతో ఆమె చేసిన ఆరోపణలు ఎన్టీఆర్‌ను బ్యాడ్ చేసేందుకు ప్రయత్నం చేశాయి కొన్ని సంస్థలు.