HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ar Rahman Mark In Peddi

AR Rahman : తెలుగు ప్రేక్షకుల అపోహలను రెహమాన్ ‘పెద్ది’తో తూడ్చేస్తాడా..?

AR Rahman : ఇప్పటికే మన స్టార్ హీరోలు దేవిశ్రీ ప్రసాద్, ఎస్.ఎస్. తమన్‌లతో సినిమాలు చేస్తున్నారు, కాబట్టి వారు కొత్త ఆప్షన్‌ల కోసం అన్వేషిస్తున్నారు

  • Author : Sudheer Date : 26-11-2025 - 12:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AR Rahman
AR Rahman

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం ప్రస్తుతం సినీ వర్గాల్లో ఒక సంచలనంగా మారింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాతలు ఏ అంశాన్ని విడుదల చేసినా అది అద్భుతమైన స్పందనను అందుకోవడం విశేషం. ముందుగా విడుదలైన ‘పెద్ది గ్లింప్స్’ విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకోగా, అందులో రామ్ చరణ్ బ్యాటింగ్ స్టైల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన ‘చికిరి’ పాట ఏకంగా 100 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సంపాదించుకుని తన తడాఖా చూపించింది. ఈ పాట విడుదలైన తర్వాత ‘పెద్ది’ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ‘పెద్ది’ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీత దర్శకుడిగా ఎంపికైనప్పుడు ఆశ్చర్యపోయి, అనుమానం వ్యక్తం చేసినవారంతా ఇప్పుడు ‘రెహమాన్ కరెక్ట్ ఆప్షన్’ అని కితాబు ఇస్తున్నారు.

Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

‘చికిరి’ పాట ఏ.ఆర్. రెహమాన్‌కు ఒక మంచి కంబ్యాక్‌ను అందించింది. కొంతకాలంగా ఆయన సంగీతం తెలుగు ప్రేక్షకులను గతంలో మాదిరిగా మెస్మరైజ్ చేయలేకపోతుందనే విమర్శ ఉంది. ముఖ్యంగా తెలుగు సినిమా పల్స్, మాస్ హీరోల క్రేజ్‌ను రెహమాన్ సరిగా అర్థం చేసుకోలేక పోతున్నారనే అభిప్రాయానికి ‘చికిరి’ పాట పుల్‌స్టాప్ పెట్టింది. ఈ పాట అద్భుత విజయం సాధించడం, రెహమాన్ కెరీర్‌లో ఒక కీలక మలుపుగా మారబోతోంది. ఇప్పుడు ‘పెద్ది’ నుంచి రెండో పాట కూడా రాబోతోంది. చిత్ర యూనిట్ ఈ పాటను డిసెంబర్ నెలలో ముఖ్యంగా క్రిస్మస్ సమయంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ రెండో పాట వేరే స్థాయిలో ఉంటుందని ‘చికిరి’ కేవలం మెచ్చుతునకే అని, ఇక రాబోయే పాటలన్నీ అంతకు మించి ఉంటాయని చిత్రబృందం ధీమాగా చెబుతోంది.

‘చికిరి’ తరహాలో రెండో పాట కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిస్తే తెలుగులో రెహమాన్ మరోసారి బడా హీరోలకు ప్రధాన ఆప్షన్‌గా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే మన స్టార్ హీరోలు దేవిశ్రీ ప్రసాద్, ఎస్.ఎస్. తమన్‌లతో సినిమాలు చేస్తున్నారు, కాబట్టి వారు కొత్త ఆప్షన్‌ల కోసం అన్వేషిస్తున్నారు. ప్రతి హీరోకూ రెహమాన్‌తో పనిచేయాలని ఉంటుంది, కానీ ఆయన ఫామ్ చూసి కొంత వెనకడుగు వేస్తున్నారు. ఇప్పుడు ‘పెద్ది’తో రెహమాన్ తన పాత ఫామ్‌లోకి వస్తే, తెలుగులో పెద్ద హీరోలకు మరో అద్భుతమైన సంగీత దర్శకుడు దొరికినట్టే అవుతుంది. రెండో పాట లిరికల్ వీడియో కూడా ఆసక్తికరంగా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం ఆల్బమ్ రెహమాన్ స్థానాన్ని తెలుగు చిత్ర పరిశ్రమలో మళ్లీ పటిష్టం చేయనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ar rahman
  • AR Rahman peddi songs
  • Peddi
  • peddi 2nd song
  • Peddi Movie
  • Peddi ram Charan
  • ram charan
  • telugu movies

Related News

Mega Power Star Ram Charan's 'Peddi' – the official announcement is out; here’s where it will stream.

Peddi OTT: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పెద్ది.. అధికారిక ప్రకటన వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ సినిమా, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జులై 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను జులై 9న విడుదల చేయనున్నారు. అయితే, హిందీ వెర్షన్ మాత్రం ఆగస్టులో అందుబాటులోకి ర

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd