Jani Master: జానీ మాస్టర్‌కు మరో షాక్.. డ్యాన్స్ అసోసియేషన్ నుంచి తొలగింపు
తెలుగు, తమిళ్, హిందీ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మా స్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆయన గ్రూప్‌లోని మరో మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది.
- By Gopichand Published Date - 08:42 PM, Tue - 17 September 24

Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master)కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం, వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌కు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గట్టి షాక్ ఇచ్చింది. జానీ మాస్టర్‌ను డ్యాన్స్ అసోసియేషన్ నుంచి తొలగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది ఫిల్మ్ ఛాంబర్. ఇకపోతే ఇప్పటికే జనసేన పార్టీ నుంచి జానీ మాస్టర్‌ను దూరంగా ఉండాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తూ సోమవారం జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.
అత్యాచార ఆరోపణల నైపథ్యంలో జానీ మాస్టర్‌ను డ్యాన్స్ అసోసియేషన్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న ఫిల్మ్ ఛాంబర్ pic.twitter.com/TYFLQA8Ffd
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2024
అసలేం జరిగింది..?
తెలుగు, తమిళ్, హిందీ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మా స్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆయన గ్రూప్‌లోని మరో మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ చేస్తున్నప్పుడు తనపై అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది. అంతేకాకుండా నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది.
ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం సదరు మహిళ నార్సింగి నివాసి అయినందున నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేయగా జానీ మాస్టర్‌పై పోలీసులు సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506), స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2), (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే బాధితురాలు 2017లో ఢీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే 2019లో జానీ మాస్టర్ బాధితురాలికి కాల్ చేసి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేయమని అడిగినట్లు బాధితురాలు తెలిపింది. అయితే ఆమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా జాయిన అయిన దగ్గర నుంచి జానీ మాస్టర్ అసభ్యంగా ప్రవర్తించాడని, కారవ్యాన్‌లో ప్యాంట్ జీప్పు విప్పి తన కోరికలు తీర్చమనేవాడని, తీర్చకుంటే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాలని బాధితురాలు చెబుతుంది.
అయితే జానీ మాస్టర్ భార్యకు కూడా ఇందులో భాగం ఉందని బాధితురాలు ఆరోపించడం కొసమెరుపు. వేధింపులు భరించలేక బయటకు వెళ్లి వేరే పని చేసుకుంటుంటే జానీ మాస్టర్, ఆయన భార్య తన ఇంటికి వచ్చి దాడి చేశారని బాధితురాలు వెల్లడించింది. జానీ మాస్టర్‌కు గతంలో సైతం నేర చరిత్ర ఉంది. 2015లో ఓ కాలేజిలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్‌లోని స్థానిక కోర్టు జానీ మాస్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.