Karna : టాలీవుడ్ నుంచి మరో కర్ణ రాబోతుందా..?
మైత్రి మూవీ మేకర్స్ (Mytri Movie Makers) నిర్మిస్తున్న ఈ సినిమాలో కాస్టింగ్ ఎవరన్నది ఇంకా తెలియలేదు. లాస్ట్ ఇయర్ మంగళవారం సినిమాతో సర్ ప్రైజ్ చేసిన
- By Ramesh Published Date - 12:39 PM, Fri - 19 July 24

ఈమధ్య తెలుగు సినిమాల్లో రామాయణ మహాభారత రిఫరెన్స్ లు బాగా వాడుతున్నారు. సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమాలో కూడా హనుమంతుడు విభీషణుడు అంటూ ప్రేక్షకులను అలరించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఈమధ్యనే వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కల్కి సినిమాలో కూడా మహాభారతం (Mahabharatam) రిఫరెన్స్ అర్జునుడు, కర్ణుడు, అశ్వద్ధామ ఇలా వీరి గురించి ప్రస్తావించారు. ప్రభాస్ కర్ణుడిగా కనిపిస్తారని అర్ధమవుతుంది.
ఐతే టాలీవుడ్ నుంచి మరో కర్ణ సినిమా రాబోతుంది. కర్ణ టైటిల్ తో RX 100 డైరెక్టర్ అజయ్ భూపతి (Ajay Bhupathi) ఒక సినిమా చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ (Mytri Movie Makers) నిర్మిస్తున్న ఈ సినిమాలో కాస్టింగ్ ఎవరన్నది ఇంకా తెలియలేదు. లాస్ట్ ఇయర్ మంగళవారం సినిమాతో సర్ ప్రైజ్ చేసిన అజయ్ భూపతి మంగళవారం 2 ని కూడా తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నాడు.
ఐతే ముందు కర్ణ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది. మరి ఈ కర్ణ దేని గురించి.. ఈ సినిమా కూడా మైథాలజీ టచ్ ఏమైనా చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా తెలుగు సినిమాల్లో ఇతిహాసాల ప్రస్తావన నేటి ప్రేక్షకులకు వాటి గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అజయ్ భూపతి స్టైల్ ఆఫ్ టేకింగ్ బోల్డ్ గా ఉంటుంది. మరి అసలు ఈ కర్ణ (Karna) కథ ఏంటి దీన్ని ఎలా తీస్తారన్నది చూడాలి.
ఆరెక్స్ 100 తర్వాత శర్వానంద్, సిద్ధార్థ్ తో మహాసముద్రం సినిమా చేసిన అజయ్ భూపతి ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తన లక్కీ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తోనే మంగళవారం చేశాడు అజయ్. ఐతే మంగళవారం మాత్రం అతని టాలెంట్ ఏంటన్నది మరోసారి ప్రూవ్ చేసింది. ఐతే ఇప్పుడు కరణతో మరో క్రేజీ అటెంప్ట్ చేస్తున్నాడని అర్ధమవుతుంది.
Also Read : Mamitha Baiju : ప్రేమలు బ్యూటీ నేచర్ లవర్..!