Tripti Dimri ఆ ప్రోత్సాహం మర్చిపోలేనిదంటున్న యానిమల్ బ్యూటీ..!
Tripti Dimri మన గురించి మనం చెప్పడం కన్నా మన పాత్రలు చెప్పేలా చేస్తే ఆ ఇంపాక్ట్ మరోలా ఉంటుంది. ఇదే విషయాన్ని తన మాటలతో చెప్పి అలరిస్తుంది యానిమల్ సెన్సేషనల్
- Author : Ramesh
Date : 03-07-2024 - 3:20 IST
Published By : Hashtagu Telugu Desk
Tripti Dimri మన గురించి మనం చెప్పడం కన్నా మన పాత్రలు చెప్పేలా చేస్తే ఆ ఇంపాక్ట్ మరోలా ఉంటుంది. ఇదే విషయాన్ని తన మాటలతో చెప్పి అలరిస్తుంది యానిమల్ సెన్సేషనల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి. అంతకుముందు అమ్మడు క్రేజ్ తెచ్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. బాలీవుడ్ లో వెబ్ సీరీస్ లతో పాటుగా మ్యూజిక్ వీడియోస్ చేసిన త్రిప్తి సినిమాల్లో కూడా నటించింది. ఐతే అవేవి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.
ఐతే యానిమల్ సినిమా తర్వాత అమ్మడి రేంజ్ మారిపోయింది. సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక కన్నా త్రిప్తికి సూపర్ క్రేజ్ వచ్చింది. ఒక్క సినిమాతో అమ్మడి రేంజ్ మారిపోయింది. ముఖ్యంగా త్రిప్తి వెంట పడి మరీ ఛాన్సులు ఇస్తున్నారు. ఐతే తను ఎక్కడకు వెళ్లినా సరే తన పాత్ర గురించి మాట్లాడి సర్ ప్రైజ్ చేస్తున్నారని అంటుంది అమ్మడు.
మీరు చూపిస్తున్న ఈ ప్రేమకు థాంక్స్. మన వర్క్ గురించి చేసిన పాత్రల గురించి ఆడియన్స్ మాట్లాడుతుంటే అది చాలా సంతృప్తిగా ఉంటుందని.. ఈమధ్య తను చేసిన సినిమాల గురించి ప్రేక్షకుల్లో చర్చ తనని మంచి జోష్ ఇచ్చిందని అంటుంది అమ్మడు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తున్న త్రిప్తి తెలుగు సినిమాల్లో కూడా నటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.
Also Read : Pooja Hegde : ఇంతకీ ఆ సినిమాలో బుట్ట బొమ్మ ఉందా లేదా..?