Janhvi Kapoor : ఆకుపచ్చని చీర..మెటాలిక్ గ్లోల్డ్ బ్లౌజ్, చేతిలో పాప్ కార్న్ జాన్వీ అందాలకు ఫ్యాన్స్ ఫిదా..!!
- By hashtagu Published Date - 09:24 AM, Tue - 1 November 22

మిలి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ చాలా బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్ సమయంలో అభిమానులను ఆకట్టుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని మిస్ చేయడం లేదు. శ్రీదేవి, బోనీకపూర్ ల ముద్దుల కూతురు జాన్వీ…ఈ మధ్య అభిమానల మధ్యే ఎక్కువగా గడుపుతోంది. ఫ్యాన్స్ ను ఆకట్టుకునేందుకు పాప్ కార్న్ కూడా అమ్ముతోంది. ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ తన అభిమానుల నుంచి ప్రశంసలు పొందుతోంది. జాన్వీ థియేటర్ ప్రాంగంణంలోని ఓ ఫుడ్ కౌంటర్ లో పాప్ కార్న్ అమ్ముతూ కెమెరాలకు చిక్కింది. జాన్వీ అమ్ముతున్న పాప్ కార్న్ కొనేందుకు అభిమానులు క్యూలో నిలుచున్నారు.
https://twitter.com/stormy_simran/status/1587059766618046464?s=20&t=PVQGcbF_eSy9YpB9dheJCA
ఇక సంప్రదాయ చీరకట్టులో జాన్వీ ఆకట్టుకుంది. ఆకుపచ్చని ఎంబ్రాయిడరీ చీరలో…మెటాలిక్ గోల్డ్ కలర్ బ్లౌజ్ అందాన్ని రెట్టింపు చేశాయి. హెయిర్ లివ్ చేసి…డాంగ్లర్ చెవిపోగులతో మరింత లుక్ పెంచేశాయి. జాన్వీ స్టైల్ కు అభిమానులు ఫిదా అయ్యారు. నవంబర్ 4న మిలి మూవీ థియేటర్లలోకి విడుదల కానుంది. ఈ మూవీలో విక్కీ కౌశల్ తోపాటు అతని తమ్ముడు సన్నీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ మలయాళ థ్రిల్లర్ రిమేక్ గా రూపొందింది.