Anasuya : పవన్ తో అనసూయ.. సాంగ్ అదిరిపోతుందట..!
హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఎప్పుడో పూర్తి చేయాల్సి ఉన్నా కూడా పవన్ వల్ల
- Author : Ramesh
Date : 23-07-2024 - 8:04 IST
Published By : Hashtagu Telugu Desk
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) తో తానొక స్పెషల్ సాంగ్ చేశానని చెప్పుకొచ్చింది స్టార్ యాంకర్ విలక్షణ నటి అనసూయ. స్టార్ మాలో లేటెస్ట్ గా వస్తున్న రియాలిటీ షోలో ఆమె హోస్ట్ గా చేస్తున్నారు. ఈ షోలో భాగంగా అనసూయ పవర్ స్టార్ తో చేయబోయే సాంగ్ గురించి రివీల్ చేసింది. ఐతే అనసూయ చెప్పిన సాంగ్ ఏ సినిమాలో అన్నది ఆలోచించడం మొదలు పెట్టారు ఆదియన్స్.
తెలుస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ అనసూయ ఇద్దరు కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagath Singh) లో అదిరిపోయే సాంగ్ చేస్తున్నారట. ఈ సాంగ్ గురించి అనసూయ చెబుతూ ఈ విషయం ఎక్కడ చెప్పలేదు కానీ నేను పవన్ కళ్యాణ్ సార్ తో ఒక సాంగ్ చేశా.. అది రిలీజ్ అయ్యాక అన్ని డాన్స్ ఫ్లోర్ లో అది వినిపిస్తుందని అన్నది
అనసూయ (Anasuya) తో పవన్ కల్యాణ్ సాంగ్ అనగానే ఆ సాంగ్ పై క్రేజ్ ఏర్పడింది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఎప్పుడో పూర్తి చేయాల్సి ఉన్నా కూడా పవన్ వల్ల లేట్ అవుతూ వస్తుంది.
పవన్ ప్రస్తుతం వీరమల్లు సినిమా ముందు పూర్తి చేయాల్సి ఉంది. ఆ సినిమా తర్వాత ఓజీని కూడా ఫినిష్ చేస్తాడని టాక్. ఈ సినిమాల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఆలోచిస్తాడు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిలీజైన టీజర్స్ అన్ని సినిమాపై సూపర్ బజ్ ఏర్పరిచాయి. నెక్స్ట్ 1 ఇయర్ లో పవన్ సెట్స్ మీద ఉన్న ఈ మూడు సినిమాలు రిలీజ్ అవనున్నాయి. సో పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే లెక్క.
Also Read : Polimera 3 : పొలిమేర 3కి కొత్త కష్టాలు.. మొదటి రెండు భాగాల్లోని సీన్స్‌ని..