Polimera 3 : పొలిమేర 3కి కొత్త కష్టాలు.. మొదటి రెండు భాగాల్లోని సీన్స్‌ని..
పొలిమేర 3కి కొత్త కష్టాలు. ఇటీవల ఈ చిత్ర నిర్మాత పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన గౌరీ కృష్ణ, తాజాగా..
- By News Desk Published Date - 04:53 PM, Tue - 23 July 24

Polimera 3 : పొలిమేర 2, పొలిమేర 3 నిర్మాతల మధ్య రోజురోజుకి ముదురుతున్న వివాదం. సత్యం రాజేశ్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను ప్రధాన పాత్రలతో చేతబడుల కాన్సెప్ట్ నేపథ్యంలో డా.అనిల్ విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన సినిమా ‘మా ఊరి పొలిమేర’. 2021లో రిలీజైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఈ మొదటి భాగాన్ని మధుపల్లి భోగేంద్ర గుప్త నిర్మించారు. ఇక ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో.. సెకండ్ పార్ట్‌ని నిర్మించే బాధ్యతని గౌరీ కృష్ణ తీసుకున్నారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.
అయితే ఈ బ్లాక్ బస్టర్ విషయంలో నిర్మాత గౌరీ కృష్ణ, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మధ్య వివాదం రాచుకుంది. గౌరీ కృష్ణ తన పోలిమరా 2 రెండు రాష్ట్రాల రిలీజ్ హక్కులను వంశీ నందిపాటికి ఇచ్చారు. ఆ సమయంలో తిరిగి చెల్లించదగిన అడ్వాన్స్ తో పాటు ఖాళీ చెక్కులను, సంతకాలు చేసిన లేఖలను, ఖాళీ బాండ్ పేపర్లను వంశీకి ఇచ్చారట గౌరీ కృష్ణ. సినిమా బ్లాక్ బస్టర్ అయిన తరువాత తనకి రావాల్సిన డబ్బుతో పాటు ఆ పేపర్స్ ని కూడా గౌరీ కృష్ణ అడుగుతుంటే.. వంశీ నందిపాటి దౌర్జన్యం చేస్తున్నారట. అంతేకాదు వంశీ నుంచి ప్రాణహాని బెదిరింపులు కూడా వస్తున్నాయని గౌరీ కృష్ణ ఇటీవల పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.
ఇక తాజాగా ఫిలిం ఛాంబర్ లో కూడా పిర్యాదు చేసారు. అయితే ఇక్కడ పొలిమేర 3కి వచ్చిన కష్టాలు ఏంటంటే.. ఈ సినిమాని వంశీనే నిర్మిస్తున్నారు. తన డబ్బుని ఇవ్వకపోవడం కాకుండా, తన అనుమతి లేకుండా పొలిమేర 3ని ప్రకటించడం పై గౌరీ కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసారు. అంతేకాదు, పొలిమేర 3లో పొలిమేర 2కి సంబంధించిన ఏ ఒక్క సన్నివేశాన్ని తన అనుమతి లేకుండా ఉపయోగించకూడని ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసారు. కాగా రెండో భాగంలో చాలా వరకు మొదటి భాగం సీన్స్ ని చూపించారు. ఇప్పుడు మూడో భాగంలో కూడా అలానే రెండో భాగం సీన్స్ చూపించాల్సి ఉంటుందని సమాచారం. దీంతో ఇప్పుడు ఈ ఫిర్యాదు పొలిమేర 3 మేకర్స్ కి ఇబ్బందిగా మారింది.