Anant Ambani-Radhika Merchant: అనంత్ అంబానీ- రాధికా మర్చంట్‌ల పెళ్లిలో సినీ తారల సందడి.. ఫొటోలు వైరల్..!
వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ (Anant Ambani-Radhika Merchant) ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
- By Gopichand Published Date - 08:41 AM, Sat - 13 July 24

Anant Ambani-Radhika Merchant: వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ (Anant Ambani-Radhika Merchant) ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. జూలై 12న జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్ ఫంక్షన్‌లో బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్టార్లు రాత్రంతా సందడి చేశారు. ఓ వైపు రెజ్లింగ్ స్టార్ జాన్ సెనా ఫుల్ అంగరంగ వైభవంగా కనిపిస్తే మరోవైపు నటి కిమ్ కర్దాషియాన్ కూడా రెడ్ ఫెయిరీ వేషధారణలో రావడంతో జనాల కళ్లు ఆమె అందంపై పడ్డాయి. బాలీవుడ్ స్టార్స్ గురించి మాట్లాడుకుంటే.. సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, షారుక్ ఖాన్, అనిల్ కపూర్, అర్జున్ కపూర్, ఖుషీ కపూర్, అనన్య పాండే, షానాయ కపూర్‌లతో సహా తారలు పాటలకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ గ్రాండ్ ఫంక్షన్‌లో తారలు ప్రదర్శించిన తీరు నిజంగా చూడదగినదిగా ఉంది. ఈ క్రమంలో అనంత్-రాధికాల కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంబానీ కుటుంబం రాయల్ లుక్
ఈ పెళ్లి వేడుకలో ముఖేష్ అంబానీ కుటుంబం చాలా రాయల్ లుక్‌లో కనిపించారు. వీటికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వరుడిగా మారిన తర్వాత అనంత్ అంబానీ చాలా హుషారుగా కనిపించారు. పెళ్లికూతురు రాధికా మర్చంట్ పాస్టెల్ కలర్ జడౌ లెహంగాలో చాలా అందంగా కనిపించారు.
Also Read: Tea Side Effects: ఉదయాన్నే లేవగానే టీ తాగుతున్నారా..? అయితే ఈ సమస్యలు రావొచ్చు..?
Okadu Antei okadu Bob ni dekataledu
Andaru Namaratha garu nei Palakaristhunaru 🙏North lo Namaratha Garu identity >> Maheshbabu 👌🔥 pic.twitter.com/mEDsbKHPFu
— Deva (@Salaar_tz) July 12, 2024
బాలీవుడ్ తారల సందడి
అనంత్ అంబానీ పెళ్లి ఊరేగింపులో బాలీవుడ్ తారలు సందడి చేశారు. రణ్‌వీర్ సింగ్ ఎనర్జీ చూడదగినదిగా ఉంది. అనిల్ కపూర్ కూడా అతని పాట ‘గల్లా గుడియా’లో డ్యాన్స్ చేయడం కనిపించింది. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా కూడా తక్కువ తినలేదు. పసుపు రంగు లెహంగా, బోల్డ్ బ్లౌజ్‌లో ఉన్న దేశీ అమ్మాయి తన విదేశీ భర్త నిక్ జోనాస్‌తో కలిసి డ్యాన్స్ చేసింది.
అనంత్ అంబానీ పెళ్లి వేడుక.. భార్య ఉపాసనతో కలిసి సందడి చేసిన రామ్ చరణ్..#AnantRadhikaWedding #Ramcharan #Upasana pic.twitter.com/jqvo9IzRQH
— ChotaNews (@ChotaNewsTelugu) July 12, 2024
సల్మాన్ ఖాన్ కూడా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు
అనంత్ అంబానీ కూడా తన పెళ్లిలో డ్యాన్స్ చేశాడు. ఈ సందర్భంగా ఇతర తారలు కూడా ఆనందంతో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ సమయంలో జాన్వీ కపూర్ రూమర్స్ ఉన్న ప్రియుడు శిఖర్ పహాడియా, అతని తమ్ముడు వీర్ పహాడియా కూడా బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అయితే బాలీవుడ్ గాయకులు తమ స్వరాలతో టోన్ సెట్ చేయడం కనిపించింది.
అంబానీ ఇంట తెలుగు హీరోలు
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లికి టాలీవుడ్ నుంచి ప్రముఖులు చాలా మంది వెళ్లారు. వారిలో రామ్ చరణ్- ఉపాసన, రానా అతని భార్య, స్టార్ హీరో వెంకటేశ్, సూపర్ స్టార్ రజినీకాంత్, తదితర తెలుగు హీరోలు అనంత్ అంబానీ వివాహనికి హాజరై స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
We’re now on WhatsApp. Click to Join.