HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Sirishs Wedding Good Wishes For Pawan Kalyan And Nagababu

అల్లు శిరీష్ పెళ్లి..పవన్‌ కల్యాణ్‌, నాగబాబులకు శుభలేఖ

  • Author : Vamsi Chowdary Korata Date : 23-02-2026 - 2:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Allu Sirish invites Pawan Kalyan and Naga Babu
AAllu Sirish invites Pawan Kalyan and Naga Babu

Allu Sirish  ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. మార్చి 6న జరగనున్న తన వివాహానికి మెగా కుటుంబ సభ్యులను స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో, తన తల్లిదండ్రులు అల్లు అరవింద్, నిర్మలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి పెళ్లి శుభలేఖను అందజేశారు. పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి ఆన్నా లెజ్నేవాతో వీరు కాసేపు ముచ్చటించారు.

మెగా బ్రదర్, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు, ఆయన భార్య పద్మజను కూడా కలిసి వివాహ వేడుకలకు రావాలని కోరారు. ఈ ఆహ్వానాలకు సంబంధించిన ఫోటోలను శిరీష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. “నేను, మా అమ్మానాన్న కలిసి పవన్ కళ్యాణ్ గారిని, శ్రీమతి లెజ్నేవా గారిని మా పెళ్లికి ఆహ్వానించాం. అలాగే నాగబాబు గారిని, శ్రీమతి పద్మజ గారిని కూడా మా వివాహ వేడుకలకు పిలిచాం. వారంతా నా పెళ్లి జరుగుతుండడం పట్ల చాలా సంతోషించారు” అని శిరీష్ తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనికా రెడ్డిని మార్చి 6న వివాహం చేసుకోబోతున్నారు. హైదరాబాద్‌లో ఈ వివాహం సంప్రదాయబద్ధంగా జరగనుంది. విశేషమేమిటంటే, మార్చి 6వ తేదీ శిరీష్ అన్న, ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల పెళ్లి రోజు. వారు 2011లో ఇదే తేదీన ఒక్కటయ్యారు. గతేడాది అక్టోబర్ 31న శిరీష్-నయనికా రెడ్డిల నిశ్చితార్థం జరగ్గా, దుబాయ్‌, హైదరాబాద్‌లలో గ్రాండ్‌గా ప్రీ-వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu aravind
  • allu arjun
  • Allu Sirish
  • allu sirish - Nayankika
  • celebrity wedding
  • mega family
  • Nayanika Reddy
  • Pawan Kalyan
  • Telugu Cinema Wedding
  • Wedding Invitation

Related News

Allu Sirish Wedding

అల్లు శిరీష్ వివాహ వేడుకలు.. పవన్ కళ్యాణ్ దంపతులకు ఆహ్వానం!

వివాహ సంప్రదాయాల్లో భాగంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన భార్యతో కలిసి తన బావగారైన మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులను స్వయంగా కలిసి పెళ్లి పత్రికను అందించారు.

  • Konidela Village

    కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

  • Jagan Pawan

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • Pawan Kalyan's Convoy Meets

    Accident : పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

Latest News

  • తెలంగాణలో మూడు కొత్త శాఖలను ప్రారంభిన ఎస్‌బీఐ లైఫ్

  • తన పేరుతో ఏర్పడిన సంస్థలపై కేటీఆర్ స్పష్టీకరణ

  • జుట్టుకు పెరుగు అప్లై చేయడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలివే!!

  • తిరుమల కోసం స్వర్ణ దేవాలయం తరహా ప్రత్యేక చట్టం? .. యోచనలో ఏపీ ప్రభుత్వ

  • రోడ్డుపై తెల్లటి గీతలు.. ఎందుకు ఉంటాయో తెలుసా?!

Trending News

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

    • సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బుమ్రా స‌రికొత్త రికార్డు!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd