HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Arjun To Megastar Chiranjeevis House

Allu Arjun- Megastar: మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్!

ఇప్ప‌టికే మెగా, అల్లు కుటుంబాల మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోంద‌ని ఫ్యాన్స్ అంటున్నారు. ఏపీ ఎన్నిక‌ల స‌మ‌యంలో అల్లు అర్జున్ జ‌న‌సేన‌ను కాద‌ని వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్య‌ర్థి శిల్పా ర‌వి రెడ్డిని స‌పోర్ట్ చేయడంతో మెగా అభిమానులు బాగా హార్ట్ అయ్యారు.

  • Author : Gopi Date : 15-12-2024 - 12:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Allu Arjun Megastar
Allu Arjun Megastar

Allu Arjun- Megastar: హైద‌రాబాద్‌లోని సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై అరెస్టై.. బెయిల్‌పై విడుదలైన నటుడు అల్లు అర్జున్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. జైలు నుంచి విడుదలైన ఆయన్ని చిత్ర పరిశ్రమకు చెందిన దర్శక-నిర్మాతలు, హీరోలు కలిసి పరామర్శించారు. నేడు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ (Allu Arjun- Megastar) వెళ్తున్న‌ట్లు తెలుస్తోంది. అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలను చిరంజీవికి అల్లు అర్జున్ వివరించే అవకాశముంది. కాగా మొన్న అల్లు అర్జున్ అరెస్ట్ కాగానే చిరు తన షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నిన్న జైలు నుంచి బన్నీ విడుదలైన తర్వాత మెగాస్టార్ సతీమణి సురేఖ అల్లు అరవింద్ ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ త‌న భార్య స్నేహా రెడ్డి, పిల్ల‌ల‌తో క‌లిసి  చిరంజీవి ఇంటికి లంచ్‌కి బ‌య‌ల్దేరిన‌ట్లు స‌మాచారం.

Also Read: Triumph Speed T4: బైక్ కొనాల‌నుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఏకంగా రూ. 18 వేలు త‌గ్గింపు!

అల్లు అర్జున్‌‌ను కలవని పవన్

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై అరెస్టై.. బెయిల్‌పై విడుదలైన నటుడు అల్లు అర్జున్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే శ‌నివారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కూడా అల్లు అర్జున్‌ను కలుస్తారని ప్రచారం జరిగింది. అయితే అల్లు అర్జున్‌ను పవన్ కలవకుండానే నేడు తిరిగి విజయవాడ వెళ్లినట్లు తెలుస్తోంది.

వివాదాలు, విమర్శలకు చెక్‌

ఇప్ప‌టికే మెగా, అల్లు కుటుంబాల మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోంద‌ని ఫ్యాన్స్ అంటున్నారు. ఏపీ ఎన్నిక‌ల స‌మ‌యంలో అల్లు అర్జున్ జ‌న‌సేన‌ను కాద‌ని వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్య‌ర్థి శిల్పా ర‌వి రెడ్డిని స‌పోర్ట్ చేయడంతో మెగా అభిమానులు బాగా హార్ట్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న్ను మెగా ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేయ‌డం మొదలుపెట్టారు. ఆడ‌పాద‌డ‌పా నాగ‌బాబు కూడా అల్లు అర్జున్‌కు త‌గిలేట‌ట్లు ట్వీట్‌లు కూడా వేశారు. ఇక పుష్ప‌-2 మూవీ విడుద‌ల సమ‌యంలో అభిమానులు సినిమాను సినిమాలాగే చూడాల‌ని నాగ‌బాబు పిలుపునివ్వ‌డంతో ఈ వార్ నిజ‌మేన‌ని అర్థ‌మైంది. ఇక తాజాగా జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో అల్లు అర్జున్.. మెగాస్టార్ ఇంటి వెళ్తుండ‌టంతో మెగా వ‌ర్సెస్ అల్లు అనే ట్యాగ్‌కు చెక్ ప‌డ‌నుంద‌ని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu aravind
  • allu arjun
  • Allu Arjun Arrest
  • Allu Arjun bail
  • bunny
  • megastar chiranjeevi
  • Pawan Kalyan
  • telangana

Related News

Nampally Court deals a blow to Icon Star Allu Arjun.

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఈ నెల‌ 22న (సోమవారం) వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా (A11) పోలీసులు చేర్చిన నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. 2024 డిసెంబర్ 4న ‘పుష్ప 2’ సినిమా బెనిఫిట్ షో స

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

Latest News

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

  • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

  • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

  • TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

  • IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd