Allu Arjun Pushpa 2 : US లో పుష్ప 2 రికార్డులు మొదలు.. నెల ముందే ఎన్ని టికెట్లు తెగాయో తెలుసా..?
Allu Arjun Pushpa 2 ఈ సినిమాపై ఉన్న అంచనాలకు తగినట్టుగానే బజ్ ఉంది. ముఖ్యంగా US లో ఈ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. అందుకే నెల ముందే సినిమాకు
- By Ramesh Published Date - 05:46 PM, Wed - 6 November 24

Allu Arjun Pushpa 2 అల్లు అర్జున్ (Allu Arjun) సుకుమార్ (Sukumar) కాంబోలో వస్తున్న పుష్ప 2 కోసం పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్స్ అంత వెయిట్ చేస్తున్నారు. పుష్ప 1 భారీ హిట్ అవ్వడంతో పార్ట్ 2 కోసం మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. ఇక సినిమాపై ఉన్న అంచనాలను అందుకునేలా సుకుమార్ క్రేజీ ప్లాన్ చేస్తున్నాడు. పుష్ప 2 అసలు కథ రెండో పార్ట్ లోనే ఉందని సుకుమార్ ముందునుంచి చెబుతున్నాడు.
అందుకే పుష్ప 2 (Pushpa 2) ని మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై ఉన్న అంచనాలకు తగినట్టుగానే బజ్ ఉంది. ముఖ్యంగా US లో ఈ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. అందుకే నెల ముందే సినిమాకు టికెట్స్ భారీగా సేల్ అవుతున్నాయి. యు.ఎస్ లో పుష్ప 2 పై ఉన్న అంచనాలకు అవుతున్న బుకింగ్స్ చూస్తుంటే సినిమా కచ్చితంగా రికార్డులను కొల్లగొట్టేలా ఉందని చెప్పొచ్చు.
19000 టికెట్స్ బుక్..
US లో నెల రోజులు ఉంది అనగానే ఇప్పటికే 19000 టికెట్స్ బుక్ అయ్యాయి. ఈ రేంజ్ లో టికెట్స్ బుక్ అవ్వడం నిజంగా రికార్డ్ అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ మాస్ స్టామినా ఏంటన్నది యు.ఎస్ లో పుష్ప ప్రీ బుకింగ్స్ ని చూస్తేనే అర్ధమవుతుంది.
అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాకు మరో హైలెట్ అయ్యేలా చూస్తున్నారు. పుష్ప 2 యు.ఎస్ లోనే ఈ రేంజ్ హంగామా చూపిస్తుంటే కచ్చితంగా తెలుగు రెండు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో మ్యాడ్ నెస్ చూపిస్తుందని చెప్పొచ్చు.
Also Read : Nagarjuna : కూలీ నాగార్జున నెక్స్ట్ లెవెల్ అంటున్నారుగా..?