Nagarjuna : కూలీ నాగార్జున నెక్స్ట్ లెవెల్ అంటున్నారుగా..?
Nagarjuna కింగ్ నాగార్జున కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఐతే రజిని జైలర్ సినిమా తరహాలోనే కూలీలో కూడా నాగార్జున, ఉపేంద్ర పాత్రలు క్యామియో రోల్
- By Ramesh Published Date - 04:03 PM, Wed - 6 November 24

సూపర్ స్టార్ రజినికాంత్ లీడ్ రోల్ లో లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఒక సినిమా వస్తుంది. ఈ సినిమాకు కూలీ అనే టైటిల్ పెట్టారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఐతే రజిని జైలర్ సినిమా తరహాలోనే కూలీలో కూడా నాగార్జున, ఉపేంద్ర పాత్రలు క్యామియో రోల్ అనుకుంటున్నారు ఆడియన్స్. వాటికి వివరణ ఇస్తూ క్రేజీ న్యూస్ చెప్పారు లోకేష్ (Lokesh) కనకరాజ్.
కూలీ సినిమాలో నాగార్జున (Nagarjuna) చేస్తున్న రోల్ క్యామియో రోల్ కాదని సినిమాలో హీరో తర్వాత అంత ఇంపార్టెంట్ రోల్ అని అన్నారు. అంతేకాదు నాగ్ సార్ ఇప్పటివరకు చేసిన పాత్రల కన్నా ఇది డిఫరెంట్ గా ఉంటుందని అన్నారు లోకేష్ కనకరాజ్. సో కూలీ సినిమాలో నాగార్జున రోల్ పై అంచనాలు భారీగా ఉన్నాయని అర్ధమవుతుంది. ఈ రోల్ తో తెలుగు ఆడియన్స్ ని మాత్రమే కాదు తమిళ ప్రేక్షకులను కూడా నాగ్ సర్ ప్రైజ్ చేస్తారని తెలుస్తుంది.
ఎలాంటి పాత్ర అయినా అవలీలగా..
కింగ్ నాగ్ ఎలాంటి పాత్ర అయినా అవలీలగా చేస్తారు. రజినికాంత్ (Rajinikanth) లాంటి సూపర్ స్టార్ సినిమాలో తన కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలని లోకేష్ కథ చెప్పగానే ఆయన ఓకే చేశారు. కూలీ (Coolie) నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ తోనే సినిమాలో కింగ్ రోల్ ఎలా ఉంటుందో చూపించాడు. కచ్చితంగా ఈ సినిమా తర్వాత నాగార్జునకు ఇతర భాషల నుంచి ప్రత్యేకమైన క్రేజ్ వస్తుందని అంటున్నారు.
కూలీ సినిమా ప్రస్తుతానికి 50 శాతం పూర్తైనట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా నటించాడు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి కూలీ సినిమా స్పెషల్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు లోకేష్ కనకరాజ్.
Also Read : Bigg Boss 8 : బిగ్ బాస్ 8 లో తెలుగు వర్సెస్ కన్నడ.. వాళ్లని విడగొట్టి సపోర్ట్ చేస్తున్న ఆడియన్స్..!