HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Arjun Marks 20 Years In The Film Industry

Allu Arjun: ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న బన్నీ.. అల్లు అర్జున్ ఎమోష‌న‌ల్ లెటర్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరో. టాలీవుడ్‌లోనే కాదు.. పాన్ ఇండియా లెవ‌ల్లో ఆయ‌న‌తో సినిమాలు చేయ‌టానికి అంద‌రూ ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఆయ‌న కూడా డిఫ‌రెంట్ సినిమాలు చేస్తూ త‌న ఇమేజ్‌ను రోజు రోజుకీ పెంచుకుంటూ దూసుకెళ్లిపోతున్నారు.

  • Author : Gopi Date : 28-03-2023 - 1:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Allu Arjun
Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరో. టాలీవుడ్‌లోనే కాదు.. పాన్ ఇండియా లెవ‌ల్లో ఆయ‌న‌తో సినిమాలు చేయ‌టానికి అంద‌రూ ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఆయ‌న కూడా డిఫ‌రెంట్ సినిమాలు చేస్తూ త‌న ఇమేజ్‌ను రోజు రోజుకీ పెంచుకుంటూ దూసుకెళ్లిపోతున్నారు. సినిమా సినిమాకు త‌న‌ని తాను మెరుగు ప‌రుచుకుంటూ న‌ట‌న‌తో పాటు డాన్సుల్లోనూ త‌న‌దైన గ్రేస్‌ను క్రియేట్ చేసుకున్నారు. త‌న‌న‌ను విమ‌ర్శ‌లు చేసిన వాళ్లే ఇప్పుడు స్టైలిష్ స్టార్‌, ఐకాన్ స్టార్ అని అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ ప్ర‌యాణానికి అక్ష‌రాలా 20 ఏళ్లు. అల్లు అర్జున్ ఈ స్థాయికి చేరుకున్నారన‌టంలో అతిశ‌యోక్తి లేదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌న రెండు ద‌శాబ్దాల ప్ర‌యాణం గురించి ఓ భావోద్వేగ లేఖ‌ను రాసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు అల్లు అర్జున్‌.

‘‘సినీ రంగంలో ఈరోజుతో నేను 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. నాపై చూపించిన ప్రేమ చూస్తే నేనెంతో అదృష్ట‌వంతుడిని. సినీ ఇండ‌స్ట్రీలోని నా స‌న్నిహితులకు ధ‌న్య‌వాదాలు. నేను ఈరోజు ఇక్క‌డ ఉన్నానంటే కార‌ణం ప్రేక్ష‌కులు, అభిమానులు, న‌న్నెంత‌గానో ఇష్ట‌ప‌డేవారు చూపించిన ప్రేమ‌. మీకెప్ప‌టికీ కృత‌జ్ఞ‌త‌ల‌తో ఉంటాను’’ అని తెలిపారు అల్లు అర్జున్‌. బన్నీ పోస్ట్‌పై సమంత, లక్ష్మీ మంచు సహా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు రియాక్ట్ అవుతున్నారు.

Also Read: Priyanka banned: హాలీవుడ్‌లో బాలీవుడ్ ర‌చ్చ! కంగ‌నా ట్వీట్

Today, I complete 20 years in the film industry. I am extremely blessed & have been showered with love . I am grateful to all my people from the industry . I am what I am bcoz of the love of the audience, admirers & fans . Gratitude forever 🙏🏽

— Allu Arjun (@alluarjun) March 28, 2023

అల్లు అర్జున్ హీరోగా న‌టించిన గంగోత్రి మార్చి 28, 2003లో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అప్ప‌టి నుంచి బ‌న్నీ డిఫ‌రెంట్ మూవీస్‌తో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఇప్పుడు రెండు క్రేజీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. అందులో ఒక‌టి పుష్ప 2 ది రూల్‌, రెండోది సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న బాలీవుడ్ ప్రాజెక్ట్‌. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా చిత్రాలుగానే సంద‌డి చేయ‌బోతున్నాయి. మరోవైపు పుష్ప.. ది రైజ్ నిర్మాతలు ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను టీజర్ రూపంలో విడుదల చేయనున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసింది చిత్ర బృందం. విశాఖపట్నంలో జరిగే మేజర్ షెడ్యూల్‌లో చాలా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • bunny
  • Manchu Lakshmi
  • pushpa
  • Samantha
  • tollywood news

Related News

Allu Arjun Nampally Court Sandhya Theater Stampede Case

Allu Arjun : ‘పుష్ప 2’ తొక్కిసలాట ఘటనలో కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ ఈ రోజు కోర్టుకు హాజ‌రుకాలేదు. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని, భవిష్యత్ విచారణలకు వర్చువల్ విధానంలో హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఈ కేసును జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో మిగిలిన నిందితులందరూ కోర్టుకు హాజరయ్యారు. 11వ నిందితుడిగా పేర్కొనబడ

  • ‘Maa Inti Bangaram’ collections are shaking up the box office.

    Maa Inti Bangaram Overseas Collection: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్స్‌

  • Nampally Court issues summons to Allu Arjun to appear in court.

    Allu Arjun: కోర్టుకు రావాలంటూ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

  • Nampally Court deals a blow to Icon Star Allu Arjun.

    Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • ‘Maa Inti Bangaram’ collections are shaking up the box office.

    Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

Latest News

  • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

  • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd