Priyanka banned: హాలీవుడ్లో బాలీవుడ్ రచ్చ! కంగనా ట్వీట్
ప్రియాంక చోప్రా(Priyanka banned), కంగనా రనౌత్ మధ్య ట్విట్టర్ వేదికగా వార్ మొదలయింది.
- By CS Rao Published Date - 01:15 PM, Tue - 28 March 23
బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా(Priyanka banned), కంగనా రనౌత్ మధ్య ట్విట్టర్ వేదికగా వార్ మొదలయింది. బాలీవుడ్(Bollywood)లోని రాజకీయాలను, కాస్టింగ్ కౌచ్ ను తెలియచేసేలా వాళ్లిద్దరి మధ్యా ట్వీట్ల యుద్ధం నెలకొంది. కరణ్ జోహార్ ను కూడా వాళ్లిద్దరి మధ్యలోకి కంగనా లాగేసింది. బాలీవుడ్ నుంచి ప్రియాంకను దాదాపుగా కరణ్ జోహార్ నిషేధించారని ట్వీట్ చేయడం దుమారం రేపుతోంది. ప్రస్తుతం హాలీవుడ్ ప్రాజెక్టుల మీద ప్రియాంక దృష్టి పెట్టారు. ఆ క్రమంలో ఆమె బాలీవుడ్ రాజకీయాలను ప్రపంచ వ్యాప్తంగా తెలిచేయడానికి ట్వీట్లను చేశారు. అందుకు ప్రతిగా కంగనా రంగంలోకి దిగి ప్రియాంకను ఆడుకుంటోంది.
ప్రియాంక చోప్రా కంగనా రనౌత్ మధ్య ట్విట్టర్ వార్(Priyanka banned)
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంక చోప్రా(Priyanka banned) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పరోక్షంగా కంగనా రనౌత్ ను టార్గెట్ చేసింది. ఫ్యాషన్ నటి తనను కార్నర్ చేసిందని పరోక్షంగా వ్యాఖ్యానించింది. హిందీ చిత్ర పరిశ్రమలో ‘రాజకీయాలతో విసిగిపోయానని’ చెప్పింది. దీంతో కంగనా రనౌత్ ట్విట్టర్లోకి వెళ్లి, బాలీవుడ్లో కరణ్ జోహార్ కు ఉన్న పట్టుతో ప్రియాంకపై నిషేధం విధించారని ఆరోపించారు. ఆమె బాలీవుడ్‌ను(Bollywood) ఎందుకు విడిచిపెట్టిందనే దానిపై ప్రియాంక చోప్రా తీవ్రంగా స్పందించింది.“బాలీవుడ్ గురించి ప్రియాంకచోప్రా చెప్పేది అబద్దాలని ప్రజలకు తెలుసన్నారు. చిత్ర పరిశ్రమ నుండి ఆమెను తరిమికొట్టారు, భారతదేశం విడిచి వెళ్ళేలా చేశారు అంటూ కంగనా ట్విట్లను చేసింది. కరణ్ జోహార్ ఆమెను నిషేధించాడని అందరికీ తెలుసు అంటూ ట్వీట్ చేయడం బాలీవుడ్ ను రఫ్పాడిస్తోంది.
Also Read : Bollywood No.1: బాక్సాఫీస్ బాద్ షా ‘పఠాన్’.. బాలీవుడ్ నెం1 గ్రాసర్ గా సరికొత్త రికార్డు!
సినిమా మాఫియా క్రూయెల్లాతో స్నేహం కారణంగా ఆమె కరణ్ జోహార్‌తో విభేదించడం గురించి మీడియా విస్తృతంగా రాసింది. అందుకే ఆమె బాలీవుడ్ ను విడిచిపెట్టాల్సిన స్థాయికి పోయిందని మరో ట్వీట్లో రాశారు.
బయటి వ్యక్తులతో ఎన్నడూ శత్రుత్వం లేని చలనచిత్ర పరిశ్రమ సంస్కృతి మరియు పర్యావరణాన్ని నాశనం చేసినందుకు బాధ్యత వహించాలి. అతని గ్యాంగ్ మరియు మాఫియా పిఆర్పై దాడి చేసి బయటి వ్యక్తులను వేధించినందుకు జవాబుదారీగా ఉండాలని కంగనా పోస్ట్ చేసింది.
క్వాంటికో’లో రెండు పీపుల్స్ ఛాయిస్ అవార్డుల
ప్రియాంక చోప్రా (Priyanka banned)తన పోడ్కాస్ట్ ఆర్మ్చైర్ ఎక్స్‌పర్ట్‌లో డాక్స్ షెపర్డ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పరిశ్రమ రాజకీయాల కారణంగా తనకు మంచి పాత్రలు రావడం లేదని అన్నారు. ఆమె మాట్లాడుతూ, “నేను పరిశ్రమలో (Bollywood) వెనుక్కు వెళ్లిపోయానని చెప్పారు. నన్ను కాస్టింగ్ చేయని వ్యక్తులు ఉన్నారు,నేను రాజకీయాలతో విసిగిపోయాను మరియు నాకు విరామం అవసరం అని అన్నారు. పాశ్చాత్య దేశాలలో ప్రియాంక ప్రయాణం సాగుతోంది. ‘క్వాంటికో’లో తన పాత్ర కోసం వరుసగా రెండు పీపుల్స్ ఛాయిస్ అవార్డులను గెలుచుకుంది. ఇది టీవీ షోగా నిలిచింది. ఆమె తదుపరి రుస్సో బ్రదర్స్ షో సిటాడెల్ మరియు హాలీవుడ్ చిత్రం లవ్ ఎగైన్‌లో కనిపించనుంది.
Also Read : Bollywood Khans: ఈ దేశం ‘ఖాన్స్’ ను మాత్రమే ప్రేమిస్తోంది.. కంగనా ట్వీట్ వైరల్!
Related News
Keerthy Suresh : కీర్తి సురేష్ బాలీవుడ్ గ్లామర్.. డోస్ పెంచిన మహానటి..!
Keerthy Suresh మహానటి కీర్తి సురేష్ సౌత్ నుంచి అలా బాలీవుడ్ వెళ్లిందో లేదో గ్లామర్ డోస్ పెంచేసింది. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్ ఆ సినిమా తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది