Akira Nandan: రేణు దేశాయ్ రెండో పెళ్లిపై అలా రియాక్ట్ అయిన అకీరా నందన్.. పవన్ ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే?
- By Sailaja Reddy Published Date - 01:25 PM, Fri - 22 March 24
టాలీవుడ్ నటి,పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె సినిమాల్లో నటించకపోయినప్పటికీ తరచూ ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తనకు తన పిల్లలకు సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకోవడంతో పాటు, తనకు తన పిల్లలకు సంబంధించిన గాసిప్స్ వినిపించిన వెంటనే వాటిని స్పందిస్తూ ఉంటుంది. తనపై నెగిటివ్‌గా కామెంట్స్ చేస్తూ ట్రోలింగ్స్ చేసే వారికి తనదైన శైలిలో బుద్ధి చెబుతూ ఉంటుంది రేణు దేశాయ్. ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో రేణు దేశాయ్ పెళ్ళికి సంబంధించి కంటిన్యూగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
అయితే పవన్ తో పెళ్లి విడాకుల తర్వాత రేణు దేశాయ్ ఆకిరా, ఆద్యలతో కలిసి నివసిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒకానొక దశలో రేణు దేశాయ్ కూడా రెండో పెళ్లికి సిద్ధమయ్యింది. సంబంధాలు కూడా చూశారు. ఒకరిద్దరితో చర్చలు కూడా జరిగాయి. రేణు దేశాయ్ కూడా మాట్లాడింది. మ్యారేజ్ చేసుకోవాలనే ఫిక్స్ అయ్యింది. తనకు వచ్చే వాడు ఎలా ఉంటాడో అనే కలలు కూడా కనింది. కానీ ఇంకా మ్యారేజ్ కాలేదు. ఇప్పుడు ఆ ప్రయత్నాలు వదిలేసుకున్నట్టు తెలుస్తుంది. రేణు దేశాయ్ మామూలు అమ్మాయి కాదు, ఆమె ఒక నటి. సెలబ్రిటీ. పైగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య అనే ట్యాగ్ ఆమెని ఇప్పటికీ వెంటాడుతుంది.
ఇవన్నీ పెద్ద బ్యాగేజ్ల, బరువులా ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుని, ఆ బరువుని తీసుకునే వ్యక్తి ఆమె జీవితంలోకి రావాలి. చాలా మెచ్యూర్డ్ పర్సన్ అయితే గానీ అది సాధ్యం కాదు. పైగా పిల్లలు ఉన్నారు. వారి విషయం లోనూ అర్థం చేసుకోవాలి. అలాంటి వాడు దొరక్కపోవడంతో ఇక లైట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర, షాకింగ్ విషయాలను పంచుకుంది రేణు దేశాయ్. తాను రెండో పెళ్లి చేసుకుంటానంటే కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు బెదిరించారట. చంపేస్తామనే బెదిరింపు పోస్ట్ లు పెట్టారట. దీనిపై ఆమె మండి పడింది. పవన్ కళ్యాణ్ మరో పెట్టి చేసుకున్నప్పుడు ప్రశ్నించని వాళ్లు తన విషయంలో ఎందుకు ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు వాటిని పట్టించుకోనని వెల్లడించింది. ఇక తాను కూడా మ్యారేజ్ చేసుకోవాలని ఎంతగానో అనుకుందట.
తమ ఫ్యామిలీ వాళ్లు కొన్ని సంబంధాలు కూడా చూశారట. ఇద్దరిది దగ్గరగా వచ్చిందని, ఒకరితో మాట్లాడానని, కానీ అది వర్కౌట్ కాలేదని తెలిపింది. ఒక సందర్భంలో పిల్లలే అన్నారట. పవన్ మరో పెళ్లి చేసుకున్నప్పుడు. మమ్మీ నువ్వెందుకు సింగిల్ గానే ఉంటున్నావు, నువ్వు కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా అని అకీరా నందన్ అడిగాడట. దానికి రేణు స్పందిస్తూ, చేసుకుంటా బాబు, అబ్బాయి దొరకాలి కదా అని చెప్పిందట. అయితే పవన్, తాను విడిపోయిన విషయం పవన్‌తో వాళ్లు ఎప్పుడూ అడగరట. అకీరా, ఆద్య చాలా మెచ్యూర్డ్ గా ఉంటారు, చిన్నపిల్లల్లా అనిపించరు అని తెలిపింది రేణు దేశాయ్..
Related News
Sai Durga Tej : కొత్త దర్శకుడితో మెగా మేనల్లుడు.. ఆ సినిమా పరిస్థితి ఏంటో..?
Sai Durga Tej విరూపాక్షతో సూపర్ హిట్ అందుకున్న మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ మేనమామ పవన్ కళ్యాణ్ తో చేసిన బ్రో కమర్షియల్ గా వర్క్ అవుట్ అయినా సినిమా అన్ని వర్గాల