Akira Nandan : ఓజీ కోసం అకిరా కూడా వెయిటింగ్..!
Akira Nandan పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ సినిమా ఫ్యాన్స్ లో భారీ అంచనాలను ఏర్పరచింది. పవర్ స్టార్ ఇంతకుముందు కూడా గ్యాంగ్ స్టర్ సినిమాలు
- Author : Ramesh
Date : 03-07-2024 - 9:15 IST
Published By : Hashtagu Telugu Desk
Akira Nandan పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ సినిమా ఫ్యాన్స్ లో భారీ అంచనాలను ఏర్పరచింది. పవర్ స్టార్ ఇంతకుముందు కూడా గ్యాంగ్ స్టర్ సినిమాలు చేసినా ఓజీ సంథింగ్ స్పెషల్ గా అనిపిస్తుంది. సాహో తర్వాత సుజిత్ చేస్తున్న ఈ ఓజీ మీద పాన్ ఇండియా లెవెల్ లో అంచనాలు ఉన్నాయి. ఓజీ టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచగా సినిమా కోసం ప్రతి పవర్ స్టార్ ఫ్యాన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.
ఐతే ఈ సినిమా కోసం కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు పవన్ తనయుడు అకిరా నందన్ కూడా ఎదురుచూస్తున్నాడట. అకిరా నందన్ తో మంచి ఫ్రెండ్ షిప్ ఉన్న అడివి శేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఓజీ కోసం ఫ్యాన్స్ తో పాటుగా అకిరా కూడా ఎదురుచూస్తున్నాడని అడివి శేష్ చెప్పారు. అంతేకాదు మనమంతా కూడా పవర్ స్టార్ ఫ్యాన్సే ఆయన్ను ఈ సినిమాలో కొత్తగా చూడబోతున్నాం అంటున్నాడు అడివి శేష్.
ఇక శేష్ సినిమాల విషయానికి వస్తే గూఢచారి 2 ఒక పక్క, డెకాయిట్ మరోపక్క ఈ రెండు సినిమాలతో అడివి శేష్ రాబోతున్నాడు. ఈ రెండు సినిమాల విషయంలో అడివి శేష్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది. ఈ సినిమాతో ఈసారి 100 కోట్ల మార్క్ రీచ్ అవ్వాలని చూస్తున్నాడు అడివి శేష్. మరి యువ హీరో అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాడా లేదా అన్నది చూడాలి.
Also Read : Ram Charan : గేమ్ ఛేంజర్ లెక్క తేలట్లేదు..?