Akira Nandan OG Video : పవన్ కళ్యాణ్ ఓజీలో అకిరా నందన్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!
Akira Nandan OG Video సినిమాలో అకిరా నందన్ మీద కొన్ని యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారని తెలుస్తుంది. దానికి సంబందించిన ఒక వీడియో ఎక్స్ లో వైరల్ అవుతుంది.
- Author : Ramesh
Date : 25-10-2024 - 10:47 IST
Published By : Hashtagu Telugu Desk
Akira Nandan OG Video పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan,) తనయుడు అకిరా నందన్ నటిస్తున్నాడని లేటెస్ట్ టాక్. సినిమాలో అకిరా నందన్ మీద కొన్ని యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారని తెలుస్తుంది. దానికి సంబందించిన ఒక వీడియో ఎక్స్ లో వైరల్ అవుతుంది. పవన్ మేనరిజం ని ఇమిటేట్ చేస్తూ అకిరా ఫైట్ సీన్స్ చేస్తున్నాడు. వీడియో అంత క్లారిటీ లేకపోయినా అక్కడ ఉంది అకిరా నందనే అంటున్నారు ఫ్యాన్స్.
స్టార్ వారసుల సినీ తెరంగేట్రంపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఉంటారు. అకిరా నందన్ ఎంట్రీపై కూడా ఫ్యాన్స్ అంతా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఐతే అకిరా మాత్రం తెర మీద కాదు తెర వెనక అంటే మ్యూజిషియన్ గా మెప్పించాలని చూస్తున్నాడు. కానీ ఫ్యాన్స్ అకిరాను కచ్చితంగా హీరో చేయాల్సిందే అని పట్టుబడుతున్నారు.
ఓజీలో అకిరా నందన్..
అకిరా నందన్ ఓజీలో నిజంగా ఉన్నాడా అతనితో యాక్షన్ సీన్స్ చేస్తున్నారా అన్న దాని మీద క్లారిటీ లేదు. కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఈ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. ఇదే జరిగితే మాత్రం ఓజీ తో అకిరా (Akira Nandan) ఎంట్రీ షురూ అయినట్టే లెక్క. సుజిత్ లాంటి ప్యాషనేట్ డైరెక్టర్ చేతిలో అకిరా తెరంగేట్రం సంథింగ్ స్పెషల్ కానుంది.
ఓజీ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తోనే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాడు సుజిత్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను 2025 సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
#AkiraNandan in #TheyCallHimOG https://t.co/8MBMj2t0uR
— TarakaNanda (@Tarakananda27) October 25, 2024