Padma Bhushan Award : పద్మ భూషణ్ రావడం పట్ల అజిత్ ఎమోషనల్
Padma Bhushan Award : పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపికవడం గౌరవంగా భావిస్తున్నట్లు తమిళ హీరో అజిత్ తెలిపారు
- Author : Sudheer
Date : 26-01-2025 - 11:17 IST
Published By : Hashtagu Telugu Desk
పద్మ భూషణ్ (Padma Bhushan) రావడం పట్ల అజిత్ (Hero Ajith) ఎమోషనల్ అయ్యారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వ్యక్తులకు అత్యున్నత పౌర పురస్కారాలు అయిన పద్మ అవార్డులను ప్రకటించింది. 2025 సంవత్సరానికి గానూ, ఈ అవార్డులు ప్రకటించబడిన జాబితాలో అనేక గొప్ప వ్యక్తుల పేర్లు ఉన్నాయి.
Rohit Sharma: రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. హిట్‌మ్యాన్ బాటలోనే జైస్వాల్!
ఈ అవార్డులు కళలు, సాహిత్యం, వైద్యం, విద్య, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, క్రీడలు, వాణిజ్యం, పరిశ్రమలు, పౌర సేవ వంటి అనేక రంగాలలోని ప్రముఖులకు ఇచ్చి, వారి విశేష కృషిని గుర్తించనున్నారు. పద్మవిభూషణ్ అవార్డుకు 7 గురు. 19 మంది వ్యక్తులకు పద్మభూషణ్ అవార్డు మరియు 113 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. ఇక పద్మభూషణ్ అందుకున్న వారిలో తమిళ్ హీరో అజిత్ కూడా ఉన్నారు.
పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపికవడం గౌరవంగా భావిస్తున్నట్లు తమిళ హీరో అజిత్ తెలిపారు. రాష్ట్రపతి, ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ రోజు నా తండ్రి జీవించే ఉంటే బాగుండేది. ఆయన నన్ను చూసి గర్వపడేవారు. నా తల్లి ప్రేమకు, త్యాగాలకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. నాకు ఈ గుర్తింపు కేవలం వ్యక్తిగత ప్రశంస మాత్రమే కాదని, అనేక మంది సమష్టి కృషి, మద్దతుకు నిదర్శనమని భావిస్తున్నా’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.