Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ హాలీవుడ్ మూవీలను ఎందుకు రిజెక్ట్ చేశారు.. కారణమిదేనా?
మీడియా కథనాల ప్రకారం.. ఐశ్వర్య రాయ్ హాలీవుడ్ చిత్రంలో నటించడానికి ఆఫర్ వచ్చింది. కానీ ఆమె తిరస్కరించింది.
- By Gopichand Published Date - 05:35 PM, Sun - 10 November 24

Aishwarya Rai: ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ (Aishwarya Rai) విడాకుల వార్తలు ఇటీవల ముఖ్యాంశాలుగా నిలిచాయి. అయితే ఈ జంట మాత్రం అలాంటివేమీ చెప్పలేదు. అభిషేక్ కానీ, ఐష్ కానీ తమ విడిపోవడం గురించి ఇంతవరకూ ఏమీ చెప్పలేదు. అయితే ఇప్పటికీ ఈ జంట విడాకులు తీసుకోవడం గాసిప్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే హాలీవుడ్ చిత్రంలో నటించేందుకు నటి నిరాకరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీని వెనుక ఉన్న కారణం కూడా వెలుగులోకి వచ్చింది.
ఐశ్వర్య రాయ్ ఎందుకు సినిమాలో నటించలేదు?
మీడియా కథనాల ప్రకారం.. ఐశ్వర్య రాయ్ హాలీవుడ్ చిత్రంలో నటించడానికి ఆఫర్ వచ్చింది. కానీ ఆమె తిరస్కరించింది. వాస్తవానికి ఆమె మిస్టర్ & మిసెస్ స్మిత్‌లో బ్రాడ్ పిట్‌తో ముద్దు సన్నివేశం, హాన్ కాక్‌లో విల్ స్మిత్‌తో సన్నిహిత సన్నివేశం చేయాల్సి వచ్చింది. కానీ ఆ సీన్లు చేయడంలో నటి అసౌకర్యాంగా ఫీల్ అయింది. ఇటువంటి పరిస్థితిలో ఆమె ఆ సీన్లు చేయడానికి నిరాకరించింది. దీంతో ఆ సినిమాల్లో నటించడానికి ఐశ్వర్యరాయ్ ఆసక్తి చూపనట్లు ఓ నివేదిక వైరల్ అవుతోంది.
Also Read: Narendra Modi : ఓబీసీలను విభజించడానికి కాంగ్రెస్-జేఎంఎం చేస్తున్న ప్రయత్నం ఇది
ఐశ్వర్య-అభిషేక్‌ల విడాకుల వార్త ఎలా చర్చకు వచ్చింది?
అయితే ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌ల విడాకుల వార్త చాలా కాలంగా గాసిప్ సర్కిల్స్‌లో స్ప్రెడ్ అవుతోంది. అయితే నవంబర్ 1న నటి పుట్టిన రోజున ఆమె భర్త కానీ, అత్తగారు కానీ, మామగారు కానీ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి వీరి విడాకుల వార్త జోరందుకుంది. టైమ్స్ నౌ.కామ్‌లోని ఒక నివేదిక ప్రకారం,, ఈ జంట రావణ్ తర్వాత మణిరత్నం చిత్రంలో మళ్లీ కలిసి చూడవచ్చని సమాచారం.
ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌ల విడాకుల వార్తలు తరచూ వస్తుంటాయి. ఈ వార్తలను వారు ఎప్పుడూ అంగీకరించలేదు. కుమార్తె ఆరాధ్య బచ్చన్ వారి మధ్య బలమైన బంధం. దీని కారణంగా వారి సంబంధం స్థిరంగా ఉంది. ఆరాధ్య బచ్చన్ తరచుగా తన తల్లితో కనిపిస్తుంటుంది. ఏదైనా ఈవెంట్ లేదా ఫంక్షన్ ఏదైనా తల్లి, కుమార్తె ఎల్లప్పుడూ కలిసి కనిపిస్తారు. కొంతకాలం క్రితం ఆరాధ్య బచ్చన్ పాఠశాలలో ఒక ఈవెంట్ జరిగింది. ఇందులో అమితాబ్ బచ్చన్‌తో పాటు ఐశ్వర్య రాయ్, అభిషేక్ కలిసి కనిపించారు.