ఎన్నాళ్లకెన్నాళ్లు.. రెండేళ్ల తర్వాత బిగ్ స్క్రీన్ పై నాని..!
హీరో నాని అనగానే పక్కింటి కుర్రాడిలా.. మిడిల్ క్లాస్ అబ్బాయిలా.. కుటంబ బాధ్యతలు మోసే టక్ జగదీశ్ లాంటి పాత్రలు కళ్ల ముందు కదలాడుతాయి. తన సహజ నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగలడు.
- By Balu J Published Date - 03:05 PM, Mon - 18 October 21

హీరో నాని అనగానే పక్కింటి కుర్రాడిలా.. మిడిల్ క్లాస్ అబ్బాయిలా.. కుటంబ బాధ్యతలు మోసే టక్ జగదీశ్ లాంటి పాత్రలు కళ్ల ముందు కదలాడుతాయి. తన సహజ నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగలడు. అందుకే ఆయనకు ‘నాచురల్ స్టార్’ అని బిరుదు. ఇప్పటివరకు ఎన్నో సినిమాలతో మెప్పించిన నాని సినిమాలు వరుసగా ఓటీటీల్లోనే రిలీజ్ అయ్యాయి. కొన్ని సినిమాలకు మంచి టాక్ వస్తే.. మరికొన్ని మాత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో నాని సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ కావడంతో ఆయన ఫ్యాన్స్ నిరాశ కలిగిందని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇంట్రస్టింగ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచింది ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ. చాలాకాలం తర్వాత హీరో నాని ఈ మూవీతో బిగ్ స్ర్కీన్ పై సందడి చేయబోతున్నాడు. అంటే దాదాపు రెండేళ్ల తర్వాత నాని కనిపించబోతున్నాడు. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ మేరకు హీరో నాని సోషల్ మీడియాలో ఓ కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు. సహజ నటన అనగానే నానితో పాటు సాయిపల్లవి సైతం గుర్తుకువస్తుంది. అలాంటిది మొదటిసారిగా ఇద్దరు కలిసి నటిస్తే చూడలన్నది చాలామంది కోరిక. సో శ్యామ్ సింగరాయ్ మూవీతో తెలుగు ప్రేక్షకుల కల నెరవేరబోతోంది కూడా. తాజాగా ‘శ్యామ్ సింగరాయ్’ టీం విడుదల చేసిన పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా సాయిపల్లవి, నాని క్రెమిస్టీ ల బాగుందంటున్నారు ఫ్యాన్స్.
తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీపై చాలా అంచనాలున్నాయి. నాని క్యారెక్టర్ చూస్తే 1900 ఏళ్ల నాటి పరిస్థితులను గుర్తుచేసే లుక్‌లో కనిపిస్తారు. ట్యాక్సివాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన పీరియడ్ మూవీలో సాయి పల్లవి, కృతి శెట్టి మరియు మడోన్నా సెబాస్టియన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమతం ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. హీరో నాని నటించిన ‘వి, టక్ జగదీశ్’ సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో దాదాపు రెండేళ్ల తర్వాత బిగ్ స్క్రీన్ పై నాని చూడటానికి అభిమానులు ఎంతో ఉత్సాహం చూపుతున్నారు.
This Christmas
Shyam will arrive where he belongs 🙂
To the big screen and to your hearts 🤍TELUGU,TAMIL,MALAYALAM,KANNADA
DECEMBER 24th 🔥#ShyamSinghaRoy @Sai_Pallavi92 @IamKrithiShetty @MadonnaSebast14 @MickeyJMeyer @Rahul_Sankrityn @vboyanapalli@NiharikaEnt pic.twitter.com/pbMojsNhs8
— Nani (@NameisNani) October 18, 2021
Related News

Varshini : పొట్టి పొట్టి బట్టలతో యాంకర్ వర్షిణి హాట్ షో
పొట్టి పొట్టి బట్టలతో యాంకర్ వర్షిణి హాట్ షో