Nidhhi Agerwal: ఎంతలా అందాలను ఆరబోసినా ఆ విషయంలో మాత్రం వెనకబడిన నిధి అగర్వాల్!
- Author : Sailaja Reddy
Date : 22-03-2024 - 10:46 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె మొదట అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలలో నటించి మెప్పించింది. కాగా నిధి అగర్వాల్ కు అందం అభినయం అన్ని ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు.
అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటే నిధి.. అప్పుడప్పుడు ఫోటోషూట్స్ చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. లెహంగా చీరకట్టులో సాగరకన్యలా మెరిసిపోతుంది అందాల నిధి. ఈ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం నిధి ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఈ అందాల తారకు అవకాశాలు మాత్రం రావడం లేదు. అయితే ఆమె అందాలను ఏ రేంజ్ లో ఆరబోసినప్పటికీ అవకాశాలు మాత్రం రావడం లేదు. తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తెలుగులో కొన్ని సినిమాలు చేసిన నిధి ఆ తర్వాత తమిళంలో శింబు జోడిగా ఈశ్వరన్ సినిమాలో నటించింది. అక్కడ కూడా ఈ బ్యూటీకి సరైన గుర్తింపు మాత్రం రాలేదు. ప్రస్తుతం నిధి హరిహర వీరమల్లు మూవీలో నటిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో యువరాణిగా నటించనుంది.