HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Actress Aishwarya Rajesh Responds To Director Veera Pandian Comments On Her 2

Aishwarya Rajesh: ఆ దర్శకుడిని ఉద్దేశిస్తూ అలాంటి ట్వీట్ చేసిన ఐశ్వర్య రాజేష్.. తెలుసుకొని మాట్లాడండి అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో ఈమె వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా

  • By Anshu Published Date - 01:00 PM, Wed - 31 January 24
  • daily-hunt
Mixcollage 31 Jan 2024 01 00 Pm 5780
Mixcollage 31 Jan 2024 01 00 Pm 5780

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో ఈమె వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒక సినిమా ఇంకా విడుదల కాకముందే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలె మలయాళంలో పులిమడ అనే ఒక చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. 2018లో వచ్చిన కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిందీ. అంతకు ముందు చాలా తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది.

ఇక తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలు చేసింది ఐశ్వర్య. విజయ్ దేవరకొండతో వరల్డ్ ఫెమస్ లవర్, నాని తో టక్ జగదీశ్, సాయి ధరమ్ తేజ్ తో రిపబ్లిక్ లాంటి సినిమాల్లో నటించింది ఐశ్వర్య రాజేష్. ఈ సినిమాలన్నీ నిరాశపరిచినప్పటికీ ఐశ్వర్య రాజేష్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. కాగా ఐశ్వర్య ప్రస్తుతం తమిళ్ సినిమాల పై ఎక్కువ దృష్టి పెట్టింది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. అయితే ఈ మధ్య ఐశ్వర్య రాజేష్ పై ఒక దర్శకుడు సంచలన కామెంట్స్ చేశారు. తమిళ్ దర్శకుడు వీరపాండియన్ ఐశ్వర్య రాజేష్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను డైరెక్ట్ చేసిన సినిమాతోనే ఐశ్వర్య రాజేశ్‌ పరిచయం అయ్యింది..

 

Thought of the Day 😊 pic.twitter.com/sisjRcZnQC

— aishwarya rajesh (@aishu_dil) January 29, 2024

ఆ విషయం ఆమె ఎక్కడా కూడా చెప్పలేదు. ఇప్పుడు స్టార్ డమ్ రావడంతో నాతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఒకప్పుడు ఆమెకు ఆటోకు కూడా డబ్బులు లేకపోతే నేనే ఇచ్చాను అంటూ షాకింగ్ విషయాలు తెలిపారు. తాజాగా ఆ వాఖ్యలపై హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ స్పందిస్తూ.. ఆయన పేరు ఎత్తకుండా ఒక ట్వీట్ చేశారు. చాలా మంది ఒక వైపే విని మాట్లాడుతూ ఉంటారు. అసలు విషయాలు తెలుసుకోకుండా ఓ నిర్ణయానికి వచ్చి జీవితంలోని అనుబంధాలను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా సరే.. పూర్తిగా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అని రాసుకొచ్చింది ఐశ్వర్య రాజేష్. అయితే ఐశ్వర్య పరోక్షంగా వీరపాండ్యన్ నే టార్గెట్ చేసి ఆ ట్వీట్ చేసిందని అంటున్నారు కొందరు నెటిజన్స్.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aishwarya Rajesh
  • social media
  • tollywood
  • tweet viral
  • veera panian

Related News

Andhra King

Andhra King Taluka Review : రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ రివ్యూ!

దండలు, అగరబొత్తులు, కొబ్బరికాయలు, పాలాభిషేకాలు, విజిల్స్, క్లాప్స్.. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక వీరాభిమాని బుర్రలో ఇవి తప్ప ఇంకేం ఉండవ్. సినిమాకి హిట్ టాక్ వస్తే జేబులో డబ్బులు తీసి పార్టీలు ఇవ్వడం.. అదే ఫ్లాప్ అని తెలిస్తే బీరు తాగి బాధపడటం.. ఇదే సగటు అభిమాని జీవితం.. అంతేనా!! ఒక్కసారి అభిమానిస్తే జీవితాంతం గుండెల్లో పెట్టుకొని తిరిగే పిచ్చోళ్లయ్యా ఫ్యాన్స

  • Ram Charan- Sukumar

    Ram Charan- Sukumar: రామ్ చరణ్- సుకుమార్‌ సినిమా జాన‌ర్ ఇదేనా!

  • Andhra King Taluka

    Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. సెన్సార్ టాక్ సూపర్ పాజిటివ్!

  • Smriti Mandhana Has Removed

    Smriti Mandhana : స్మృతి మంధాన పెళ్లి జరిగేనా..? పోస్టులు డిలీట్ చేయడానికి కారణం ఏంటి..?

  • Aadhi Pinisetty

    Aadhi Pinisetty : అఖండ 2 పై షాకింగ్ ట్విస్ట్ రివిల్ చేసిన ఆది!

Latest News

  • Rishabh Pant: అభిమానుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన టీమిండియా క్రికెట‌ర్‌!

  • Ayodhya: ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య.. రియల్ ఎస్టేట్‌లో నూతన శకం!

  • Telangana Global Summit 2025 : గ్లోబల్ సమ్మిట్లో నోరూరించే తెలంగాణ వంటకాల ఫుడ్ మెనూ !!

  • Viral: చిరు తో కొండా సురేఖ సెల్ఫీ..మెగా క్రేజ్ అంటే ఇది కదా !!

  • Group-2 Rankers : 2015 గ్రూప్-2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట

Trending News

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd