Actor Sonu Sood: కరీంనగర్ చిన్నారికి ప్రాణం పోసిన సోనూసూద్!
నటుడు సోనూసూద్ సేవల గురించి తెలిసిందే. కరోనా సమయంలో ఎంతోమంది సాయం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు.
- Author : Balu J
Date : 20-07-2022 - 3:50 IST
Published By : Hashtagu Telugu Desk
నటుడు సోనూసూద్ సేవల గురించి తెలిసిందే. కరోనా సమయంలో ఎంతోమంది సాయం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. కేవలం పాండమిక్ టైంలోనే కాకుండా ఇతర సమయాల్లోనూ తన సేవలను కొనసాగిస్తున్నాడు. తాజాగా సోనుసూద్ తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన చిన్నారికి సాయం చేసి మరోసారి తాను రియల్ హీరో అని చాటుకున్నాడు. కరీంనగర్‌కు చెందిన 7 నెలల చిన్నారి సఫాన్ అలీకి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడంలో సహాయం చేశాడు.
కేరళలోని కొచ్చిలోని ఆస్టర్ మెడ్‌సిటీ ఆసుపత్రిలో చికిత్స జరిగింది. సఫాన్ అలీకి నాలుగు నెలల వయస్సు ఉన్నప్పుడు కొచ్చిలోని ఆస్టర్‌కు తీసుకువచ్చారు. వైద్య పరిభాషలో చెప్పాలంటే బిలియరీ అట్రేసియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి తరువాత కాలేయ వైఫల్యానికి దారితీసింది. తల్లిదండ్రులు, దాతలు సోనూ సూద్ ను సంప్రదించడంతో చిన్నారికి సాయం అందింది.