స్మృతి మంధాన మాజీ బాయ్ ఫ్రెండ్‌పై చీటింగ్ కేసు..!
గతేడాది నవంబర్‌లో స్మృతి మంధాన- పలాష్ ముచ్చల్ వివాహం జరగాల్సి ఉంది. నిర్ణయించిన తేదీన పెళ్లి వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి.
- Author : Gopichand
Date : 23-01-2026 - 9:00 IST
Published By : Hashtagu Telugu Desk
Palash Muchhal: గాయకుడు పలాష్ ముచ్చల్ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. గతంలో పలాష్ తన క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్ స్మృతి మంధానను ‘మోసం’ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మంధాన స్నేహితుడి వద్ద 40 లక్షల రూపాయల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. విద్యాన్ మానే అనే వ్యక్తి తన డబ్బు తిరిగి ఇవ్వలేదని పలాష్‌పై ఆరోపణలు చేశారు. అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిజానికి ఒక సినిమాలో పెట్టుబడి పెట్టే విషయమై జరిగిన చర్చలతో ఈ వ్యవహారం మొదలైంది. మీడియా నివేదికల ప్రకారం.. సాంగ్లీకి చెందిన విద్యాన్ మానేను స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన, పలాష్ ముచ్చల్‌కు పరిచయం చేశారు. విద్యాన్, స్మృతి స్నేహితులని సమాచారం. వీరిద్దరూ డిసెంబర్, 2023లో కలిసినట్లు తెలుస్తోంది.
సినిమాలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని వాగ్దానం
పలాష్ తన ‘నజరియా’ అనే సినిమాలో పెట్టుబడి పెట్టమని విద్యాన్ను కోరారు. దీనితో విద్యాన్ ఆ సినిమాలో 40 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. సినిమా OTTలో విడుదలైన వెంటనే అతనికి లాభం (ప్రాఫిట్) అందుతుందని విద్యాన్కు చెప్పారు. అయితే ఆ సినిమా అసలు రూపొందనే లేదు. సినిమా పూర్తి కాకపోయినా, విడుదల కాకపోయినా పలాష్ విద్యాన్ డబ్బును తిరిగి ఇవ్వలేదు.
Also Read: 8వ వేతన సంఘం.. ఎంతమంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది?
దీనితో విద్యాన్ పోలీసులను ఆశ్రయించారు. తాను డబ్బు ఇచ్చినట్లు ధృవీకరించే పత్రాలను పోలీస్ సూపరింటెండెంట్‌కు సమర్పించారు. అంతేకాకుండా పలాష్ బలవంతం మీదనే తాను సినిమాలో పెట్టుబడి పెట్టానని విద్యాన్ పేర్కొన్నారు. సినిమా విడుదల కాకపోవడంతో విద్యాన్ తన డబ్బు అడిగారు. కొన్ని నెలల పాటు వేచి చూసిన తర్వాత చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్మృతి మంధానను మోసం చేసినట్లు ఆరోపణ
గతేడాది నవంబర్‌లో స్మృతి మంధాన- పలాష్ ముచ్చల్ వివాహం జరగాల్సి ఉంది. నిర్ణయించిన తేదీన పెళ్లి వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి. కానీ ఈలోగా మంధాన తండ్రి ఆరోగ్యం క్షీణించిందనే వార్త వచ్చింది. ఆ తర్వాత కొద్దిరోజులకే అధికారిక ప్రకటన ద్వారా పెళ్లి జరగడం లేదని స్పష్టం చేశారు. మంధాన- పలాష్ దాదాపు 6 ఏళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు.