Mrunal Thakur : ఫ్యామిలీ స్టార్ లో మృణాల్ ఆ టాలెంట్ చూపించబోతుందా..?
సీతారామం, హాయ్ నాన్న కెరీర్ లో రెండు సూపర్ హిట్లు అందుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తెలుగులో టాప్ చెయిర్ అందుకునేందుకు ప్రయత్నిస్తుంది.
- By Ramesh Published Date - 11:24 AM, Thu - 1 February 24

సీతారామం, హాయ్ నాన్న కెరీర్ లో రెండు సూపర్ హిట్లు అందుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తెలుగులో టాప్ చెయిర్ అందుకునేందుకు ప్రయత్నిస్తుంది. టాలీవుడ్ ఎంట్రీతోనే సూపర్ హిట్ ఆ తర్వాత మరో కూల్ హిట్ రెండు వరుస హిట్ల తర్వాత ఏ హీరోయిన్ అయినా ఒక రేంజ్ లో డిమాండ్ చేస్తుంది.
We’re now on WhatsApp : Click to Join
ప్రస్తుతం మృణాల్ పరిస్థితి కూడా అంతే. తన థర్డ్ మూవీగా మృణాల్ ఠాకూర్ విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ చేస్తుంది. ఈ సినిమాతో మరోసారి తన హిట్ సెంటిమెంట్ రిపీట్ చేయాలని చూస్తుంది అమ్మడు.
మృణాల్ ఒక క్లాసికల్ డ్యాన్సర్ ఆమెలోని ఆ యాంగిల్ ని ఇప్పటివరకు ఏ డైరెక్టర్ చూపించలేదు. అయితే ఫ్యామిలీ స్టార్ లో మృణాల్ డ్యాన్స్ టాలెంట్ కూడా చూపిస్తుందని టాక్. మృణాల్ లోని ఈ టాలెంట్ ని ఫ్యామిలీ స్టార్ సినిమాలో వాడేశారట. పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
మృణాల్ ఇప్పటి వరకు చేసిన రెండు తెలుగు సినిమాల్లో ఆమె నటించిన పాత్రలతో మెప్పించింద్. అయితే ఫ్యామిలీ స్టార్ లో మాత్రం తన డ్యాన్స్ తో మెప్పిస్తుందట. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కి మృణాల్ ఠాకూర్ మంచి ప్లస్ పాయింట్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లాన్ ఓ రేంజ్ లో ఉండగా రౌడీ ఫ్యాన్స్ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.
Also Read : Sandeep Vanga : యానిమల్ పార్క్ రిలీజ్ ఎప్పుడు ఉంటుంది.. సందీప్ వంగ ఎలా ప్లాన్ చేస్తున్నాడు..?