Salman Khan : తనకు మరింత భద్రత కోసం అత్యాధునిక బుల్లెట్ ప్రూఫ్ వాహనం.. సల్మాన్ ఖాన్
స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ గత కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో బెదిరింపులు. బిష్ణోయ్ గ్యాంగ్ రెక్కీ చేసినట్టుగా కూడా మీడియాలో కథనాలు వచ్చాయి.
- Author : Maheswara Rao Nadella
Date : 07-04-2023 - 3:45 IST
Published By : Hashtagu Telugu Desk
Salman Khan : స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ గత కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో బెదిరింపులు .బిష్ణోయ్ గ్యాంగ్ రెక్కీ చేసినట్టుగా కూడా మీడియాలో కథనాలు వచ్చాయి. తనకు బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ తుపాకీ లైసెన్స్ కూడా పొందారు. ఆయనకు పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు.
అయితే, మరింత మెరుగైన భద్రత కోసం సల్మాన్ ఖాన్ (Salman Khan) కొత్తగా నిస్సాన్ ‘పెట్రోల్’ ఎస్ యూవీని కొనుగోలు చేశాడు. ఇది హైఎండ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం. దీన్ని ఫారెన్ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకున్నారు. నిస్సాన్ పెట్రోల్ భారత మార్కెట్లోకి ఇంకా అడుగుపెట్టలేదు. దీని ఖరీదు రూ.2 కోట్ల వరకు ఉంటుంది.
ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ కారు. మందంగా ఉండే దీని విండ్ షీల్డ్, డోర్ గ్లాసులను బుల్లెట్లు ఏమీ చేయలేవు. ఇందులో శక్తిమంతమైన 5.6 లీటర్ వీ8 ఇంజిన్, 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ గేర్ వ్యవస్థ పొందుపరిచారు.
Also Read: Pargya jaiswal : టాప్ లేకుండా ప్రగ్యా జైస్వాల్ పరువాల విందు