HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >The Share Price Has Fallen Sharply Causing Concern Among Investors

భారీగా పడిపోయిన షేర్ ధర.. ఆందోళనలో ఇన్వెస్టర్లు

  • Author : Vamsi Chowdary Korata Date : 02-01-2026 - 12:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shares Crash
Shares Crash

Shares Crash : కొత్త సంవత్సరం తొలి రోజు భారత స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడవగా.. రెండో రోజు మాత్రం దూసుకెళ్తున్నాయి. పలు హెవీ వెయిట్ స్టాక్స్ రాణిస్తుండటం కలిసొస్తుంది. అయితే ఇదే క్రమంలో ఒక దిగ్గజ కంపెనీ స్టాక్ ధర కిందటి రోజుతో పోలిస్తే ఇవాళ నేరుగా 80 శాతం పడిపోయింది. దీనికి కారణం తెలియక ఇన్వెస్టర్లు తలలు పట్టుకుంటున్నారు. అసలు ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2025లో స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ట్రేడైన సంగతి తెలిసిందే. అంతకుముందు ఏడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగి డిసెంబరులో ఆల్ టైమ్ హైని సూచీలు తాకినప్పటికీ.. ఏడాది వ్యవధిలో సూచీల్లో పెద్దగా మార్పు లేదని చెప్పొచ్చు. ఇక కొత్త సంవత్సరంలో జనవరి 1న సూచీలు ఫ్లాట్‌గానే ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 32, నిఫ్టీ 17 పాయింట్ల స్వల్ప నష్టాల్ని నమోదు చేశాయి. విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల్ని పెద్ద ఎత్తున ఉపసంహరించుకోవడం, సిగరెట్లపై జీఎస్టీని కేంద్రం 40 శాతం పెంచుతున్నట్లు నోటిఫై చేయడంతో ఐటీసీ సహా ఇతర సిగరెట్ కంపెనీల షేర్లలో అమ్మకాలు భారీగా జరగడంతో చివరకు నష్టాల్లో ముగిశాయి.

ఇక జనవరి 2న మాత్రం స్టాక్ మార్కెట్లు రాణిస్తున్నాయి. ఈ వార్త రాసే సమయంలో జనవరి 2, మధ్యాహ్నం 12 గంటలకు సెన్సెక్స్ ఏకంగా 450 పాయింట్లకుపైగా పెరిగి 85,650 స్థాయిలో ఉంది. నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో 26,290 స్థాయిలో కదలాడుతోంది. ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్బీఐ, టాటా మోటార్స్ ఇలా పలు ప్రముఖ హెవీ వెయిట్ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లు పుంజుకునేందుకు దోహదపడుతున్నాయి.

ఇదే సమయంలో మల్టీ కమొడిటీ ఎక్స్చేంజి ఆఫ్ ఇండియా లిమిటెడ్ స్టాక్ ధర భారీగా తగ్గినట్లు చూయిస్తుంది. ఇన్ని రోజులు రూ. 10 వేల స్థాయిలో ఉన్న షేర్ ధర ఒక్కసారిగా రూ. 2 వేల స్థాయికి దిగొచ్చింది. జనవరి 1న NSE లో ఎంసీఎక్స్ షేరు రూ. 10,989 వద్ద సెషన్ ముగించింది. ఇవాళ్టి ధర చూస్తే ఏకంగా రూ. 2,220 స్థాయిలో ట్రేడవుతోంది. కిందటి రోజు ముగింపు ధర డీమ్యాట్ అకౌంట్లలో లేదా ఇన్వెస్టర్లలో పోర్ట్‌ఫోలియోలో రూ. 2,197.80 గా చూయిస్తుంది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 11.36 వేల కోట్లుగా ఉంది.

అంటే ఇక్కడ రూ. 10,989 నుంచి రూ. 2,217 కు షేర్ ధర తగ్గింది. ఇది ఏకంగా 80 శాతం తగ్గుదల. దీంతో అసలు షేర్ ధర ఇంతలా ఎందుకు పడిపోయింది.. ఏమైందని.. ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారు.. ఇతర పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. చాలా మందికి ఏం జరిగిందో.. దీని గురించి అవగాహన ఉండదు. అయితే ఇక్కడ ఇన్వెస్టర్లు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన పని లేదు.

ఇటీవల ఎంసీఎక్స్ కంపెనీ స్టాక్ స్ప్లిట్ (షేర్ల విభజన) ప్రకటించింది. 1:5 రేషియోలో అనౌన్స్ చేయగా.. రికార్డ్ డేట్ జనవరి 2గా ఉంది. దీంతో.. ఇన్వెస్టర్ దగ్గర ఉన్న ఒక్కో ఈక్విటీ షేరు.. 5 షేర్లుగా రూపాంతరం చెందుతుందన్నమాట. దీనికి అనుగుణంగానే సాంకేతికంగా షేర్ ధరను అడ్జస్ట్ చేస్తారన్నమాట. రూ. 10 ముఖ విలువ ఉన్న ఒక్కో షేరు రూ. 2 ఫేస్ వాల్యూ ఉన్న 5 షేర్లుగా మారుతుంది. ఇదే రేషియోలో స్టాక్ ధరను కూడా విభజించారు. అప్పుడు పెట్టుబడి మాత్రం అలానే ఉంటుంది. షేర్ల సంఖ్య మాత్రం 5 రెట్లు పెరుగుతుందన్నమాట. ఇక్కడ స్టాక్ స్ప్లిట్ వల్ల షేరు ధర తగ్గి అందరికీ కొనుగోలు చేసేందుకు మరింత అందుబాటులోకి వస్తుందని కంపెనీలు నమ్ముతుంటాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Mcx Share Price
  • MCX Shares Crash
  • sensex
  • Share Market Today
  • share price
  • Share Price Really Crash

Related News

    Latest News

    • రామ్ చరణ్ పెద్ది సెకండ్ సాంగ్ కి లేటెస్ట్ ప్లాన్!

    • రూ.7వేల కోట్లతో హైదరాబాద్ కు గోదావరి జలాలు – సీఎం రేవంత్

    • ‘నీలకంఠ’ మూవీ టాక్

    • గోరఖ్‌పుర్‌ నుంచి మంచిర్యాలకు.. రైలు ఇంజిన్‌పై దాక్కుని ప్రయాణిస్తున్న ఓ యువకుడు

    • భారీగా పడిపోయిన షేర్ ధర.. ఆందోళనలో ఇన్వెస్టర్లు

    Trending News

      • యూట్యూబర్ నా అన్వేష్‌కు ఉగ్రెయిన్ మహిళ వార్నింగ్..

      • రవితేజ-వివేక్ ఆత్రేయ కాంబోలో హారర్ థ్రిల్లర్?

      • కొత్త సంవ‌త్స‌రం రోజే అమెరికాకు బిగ్ షాక్‌!!

      • ఫిబ్ర‌వరి 1 నుండి భారీగా పెర‌గ‌నున్న ధ‌ర‌లు!

      • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భార‌త్ జ‌ట్టు 2026 టీ20 ప్రపంచ కప్ గెలవగలదా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd